ఇకపై అలాంటి పాత్రలను ఈ నటి చేయదట


ఇకపై అలాంటి పాత్రలను ఈ నటి చేయదట
ఇకపై అలాంటి పాత్రలను ఈ నటి చేయదట

భాష ఏదైనా, ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా కెరీర్ మొదట్లో ఎలాంటి పాత్రలు చేసారో తర్వాత కూడా అలాంటి పాత్రలే వస్తూ ఉంటాయి. ఇది హీరోయిన్ల విషయంలో బాగా వర్తిస్తుంది. ఎవరైనా కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలు పోషించినట్లైతే వారికి ఆ తర్వాత నుండి అలాంటి పాత్రలే ఆఫర్ చేస్తూ ఉంటారు. అదే పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ డీ గ్లామరస్ పాత్రలైతే అన్నీ అలాంటివే వస్తూ ఉంటాయి. ఈ విషయం మీద ఎవరికైనా అనుమానాలు ఉంటే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ను అడిగితే సరిగ్గా సమాధానం చెబుతుంది. కెరీర్ ఆరంభంలోనే వయసుకు మించిన పాత్రలు వేసి బాగా ఇబ్బంది పడింది ఈ నటి.

20 ఏళ్ల వయసులోనే తల్లి పాత్ర పోషించింది ఈ హీరోయిన్. కాక ముట్టై సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించింది. ఈ సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బోలెడన్ని అవార్డులు కూడా ఆమె ముంగిట నిలిచాయి. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఆ తర్వాత కూడా ఆమెకు ఎక్కువగా డీ గ్లామర్ పాత్రలే ఆఫర్ చేస్తూ వచ్చారు దర్శకనిర్మాతలు. కెరీర్ లో ఇప్పటికే చాలా సార్లు తల్లి పాత్రలు వేసేసింది ఈ నటి. తెలుగులో ఇటీవలే చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా ఐశ్వర్య తల్లిగానే నటించింది.

అయితే ఎంత పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలైనా వరసగా అవే ఆఫర్ చేస్తూ ఉంటే ఎలా అని వాపోతోంది. ఇందుకోసమే కెరీర్ లో ఒక కీలక నిర్ణయం తీసుకుందిట. ఇకపై వయసుకు మించిన పాత్రలు అస్సలు పోషించనని తేల్చి చెప్పేసింది. అయితే ఒకసారి ముద్ర పడ్డాక అది అంత సులువుగా తెగిపోయేది కాదుగా. మరి ఐశ్వర్య రాజేష్ కు ఉన్న పళంగా గ్లామర్ పాత్రలు ఇచ్చేయాలంటే ఎలా? కొంచెం వేచి చూడాలి మరి.