జూనియర్ ఎన్టీఆర్ ఈ భామకు ఛాన్స్ ఇస్తాడా ?


నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం , ఆయనతో ఒక్క సినిమాలోనైనా నటించాలని ఆశగా ఉంది ఆ ఛాన్స్ వస్తే సంతోషం అని అంటోంది ఐశ్వర్య రాజేష్ . తెలుగులో పలు చిత్రాల్లో 80 వ దశకంలో నటించిన నటుడు రాజేష్ . విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన రాజేష్ కూతురే ఈ ఐశ్వర్య రాజేష్ . అయితే తెలుగమ్మాయి అయినప్పటికీ చెన్నై లో పుట్టి పెరగడం వల్ల తమిళ సినిమాల్లో మాత్రమే నటిస్తోంది .

తాజాగా ఈ భామకు తెలుగులో ఛాన్స్ లు వస్తున్నాయి . కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో పాటుగా విజయ్ దేవరకొండ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది . అయితే ఈ భామకు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నటించాలని ఆశగా ఉంది . తమిళంలో స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో మాత్రం ఇంకా అంతగా క్రేజ్ రాలేదు . కానీ ఎన్టీఆర్ సరసన నటించాలని ఆశపడుతోంది అయితే ఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తాడా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే ! జూనియర్ ఎన్టీఆర్ ఐశ్వర్య రాజేష్ కోరిక తీరుస్తాడో ? లేదో ?