భూపతికి – మాస్ మహారాజ్ కి యుద్ధం.


Ravi Teja And Anay Bhupathi
భూపతికి – మాస్ మహారాజ్ కి యుద్ధం.

“RX 100” సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు “అజయ్ భూపతి“, తన తదుపరి రెండవ సినిమా గురించి బాగా పాపులర్ అయ్యాడు, మిస్ ఫైర్ కూడా అయ్యాడు .. మాస్ మహారాజ్ “రవితేజ” మీద నిందలు వేస్తున్నారు. ఏంటో చూసొద్దాం రండి.

భూపతి గారు తన రెండవ సినిమా రవితేజ గారితో చేస్తున్నారు, సినిమా పేరు “మహా సముద్రం”, ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ లో బొమ్మరిలు హీరో “సిద్ధార్థ” కూడా చేస్తున్నాడు అని వార్తలు వచ్చాయి.. అవి మన అందరం చదివేసి ఉన్నాం, మరి ఇంతలో ఏమైందో ఏమో గాని, రవితేజ ని “చీప్ స్టార్” అని ట్విట్టర్ లో ఈ నెల 2 వ తారీఖున ట్వీట్ చేశారు.

వాస్తవానికి “ఆర్.జి.వి” శిష్యుడైన అజయ్ మొదట ఎవర్ని తిడుతున్నాడో తెలవకపోగా అందరూ ఏంటీ, ఎందుకు చీప్ స్టార్ అంటున్నారు, ఎవరిని అంటున్నారు అని అడిగారు.. దానికి సమాధానంగా అజయ్ ఏం రిప్లై కూడా ఇవ్వలేదు.

అయితే ఈ మధ్య ఒక వార్త ఫిలిం నగర్లో చెక్కర్లు కొడుతుంది అదిఏమిటి అంటే ..రవితేజ గారు సగం కథ మాత్రమే నచ్చింది అని చెప్పారు, మిగిలిన కథ నచ్చలేదు మార్చమంటే నేను మార్చను, ఇది నా కథ నేను ఇలానే చేస్తా, మీకు ఇష్టం ఉంటే చెయ్యండి అని రవితేజ గారితో అజయ్ అలా అనేసరికి, రవితేజ గారు.. నేను కూడా నీతో సినిమా చెయ్యను అని అన్నారు అంటా.

ఒకరకంగా ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటే సెటిల్ అయిపోయేది, అనవసరంగా ట్విట్టర్ వేదికగా రవితేజ ని నిందించడం సరికాదు, మా రవితేజ గారు ఇప్పటి వరకు ఏ దర్శకుడితో ఇలా ప్రవర్తించలేదు, నీకు రెండవ సినిమాకి అంత బలుపు అవసరం లేదు.. అని రవితేజ గారి అభిమానులు ట్విట్టర్ లో అజయ్ గారికి ఘాటుగా రిప్లై ఇస్తున్నారు.

మరి చూద్దాం ఇద్దరిలో ఎవరిది తప్పో? లేక అజయ్ చేసిన ట్వీట్ వేరే ఇంకొకరి గురించా? అని తెలవాలి అంటే ఇద్దరిలో ఎవరో ఒక్కలు నోరు విప్పాల్సిందే. రవి తేజ గారు ప్రెసెంట్ ఐర్లాండ్ లో “డిస్కో రాజా” షూటింగ్ లో ఉన్నారు అని మనకి తెలిసిన వార్తే కదా.. మరి ఇక అజయ్ గారే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలి. అజయ్ సన్నిహితులు మాత్రం రవితేజ గారు కథలో మార్పులు చెప్పినందుకు అలా అనుండొచ్చు అంటున్నారు.

Credit: Twitter