ఆ హీరోని “చీప్ స్టార్” అంటున్న దర్శకుడు !


Ajay Bhupathi comments on Ravi Teja
Ajay Bhupathi comments on Ravi Teja

ఆర్ ఎక్స్ 100” చిత్రంతో సూపర్ హిట్ సాధించిన దర్శకుడు అజయ్ భూపతి. చిన్న సినిమాగా విలెజ్ బ్యాక్డ్రాప్ లో రూపొందిన ఆ చిత్రం 50కోట్ల దాకా కలెక్ట్ చేసి సెన్సేషన్ సృస్టించింది. అంతటి పెద్ద హిట్ చిత్రం తీసిన డైరెక్టర్ అజయ్ కి అవకాశాలు రాలేదు.

పెద్ద హీరోలను మినహాయిస్తే ఆల్ మోస్ట్ యంగ్ హీరోస్ అందరికి కథలను నేరేట్ చేసాడు ఈ సక్సెస్ డైరెక్టర్. ఫైనల్ గా రవితేజ కథ ఒకే చేసాడని, ఆచిత్రం త్వరలో ప్రారంభం కానుందని, టైటిల్ మహాసముద్రం అని రకరకాల ఊహాగానాలు వినిపించాయి.

ఏమైందో ఏంటో గానీ రవితేజ-అజయ్ భూపతి ల చిత్రం ఆగిపోయిందని మరో వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో సిద్దార్థ కూడా ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడని న్యూస్ స్ప్రెడ్ అయింది. హాట్ న్యూస్ ఏంటంటే దర్శకుడు అజయ్ భూపతి ” చీప్ స్టార్ ” అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

గత కొన్ని నెలలుగా మహాసముద్రం స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్న అజయ్ భూపతి ఒక్కసారిగా ఇలా ట్వీట్ చేయడం అది మాస్ మహారాజ్ రవితేజనేనని అందరికీ అర్ధం అయ్యివుంటుంది. అజయ్ భూపతి ఇప్పుడు అదే స్క్రిప్ట్ ని యువసామ్రాట్ నాగచైతన్యకి వినిపించాడని, అది సమంతకు కూడా బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని జెమినీ కిరణ్ నిర్మించనున్నారని పరిశ్రమలో న్యూస్ హల్ చల్ చేస్తోంది…!!