`ఆర్ఆర్ఆర్‌`: ఈ సారి అజ‌య్‌దేవ‌గ‌న్ వంతు!

Ajay devgn birthday surprise on april 2nd from RRR
Ajay devgn birthday surprise on april 2nd from RRR

`బాహుబ‌లి` చిత్రానికి సంబంధించిన క్యారెక్ట‌ర్‌ల‌ని ప్ర‌త్యేకంగా న‌రిచ‌యం చేసిన రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్‌`కు కూడా అదే ఫార్ములాని ఉప‌యోగిస్తున్నారు. ఆయ‌న తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ఆర్ఆర్‌`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. కొమ‌రం భీం, అల్లూరి సీతారామ‌రాజుల క‌ల్పిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజున భీం ఫ‌ర్ రామ‌రాజు, ఎన్టీఆర్ పుట్టిన రోజున రామ‌రాజు ఫ‌ర్ భీం,.. రీసెంట్‌గా రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజున రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి స‌తీరామరాజు మ‌హోగ్ర‌రూపం అంటూ స‌రికొత్త లుక్‌ని రిలీజ్ చేసి స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. అంత‌కు ముందు అలియాభ‌ట్ పుట్టిన రోజున సీత లుక్‌లో అలియా ఫ‌స్ట్ లుక్‌ని రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

ఇక త్వ‌ర‌లో ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న అజ‌య్ దేవ్‌గ‌న్‌కి సంబంధించిన ఫ‌స్ట్ గ్లింప్స్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇదే విష‌యాన్ని `ఆర్ఆర్ఆర్‌` టీమ్ వెల్ల‌డించింది. ఏప్రిల్ 2న అజ‌య్‌ దేవ‌గ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా `ఆర్ఆర్ఆర్‌`టీమ్ ఫ‌స్ట్ గ్లింప్స్‌ని రిలీజ్ చేస్తున్నారు. `మునుపెన్న‌డూ చూడ‌ని స‌రికొత్త అవ‌తారంలో అజ‌య్ దేవ‌గ‌న్‌ని చూపించ‌బోతున్నాం` అని `ఆర్ఆర్ఆర్‌`టీమ్ ట్వీట్ చేసింది. ` ఈ చిత్రం నాకొక ఉత్తేజ‌క‌ర‌మైన అనుభ‌వాన్నిచ్చింది. ఇందులో రాజ‌మౌళి సృష్టించిన నా పాత్ర‌ని మీరు ప‌రిచ‌యం చేసేందుకు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను` అని జ‌జ్ఞ్ దేవ‌గ‌న్ ట్వీట్ చేశారు.