`ఆర్ ఆర్ ఆర్‌`లో అజ‌య్ పాత్ర నిడివి ఎంత‌?


Ajay Devgn onscreen duretion in RRR revealed
Ajay Devgn onscreen duretion in RRR revealed

రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్` సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. `బాహుబ‌లి`లో తెలుగు, త‌మిళ న‌టులు మాత్ర‌మే వుండ‌టంతో  ఈ సినిమా రిలీజ్ వ‌రకు ద‌క్షిణావి వ‌ర‌కే ఈ సినిమాపై చ‌ర్చ జ‌రిగింది. అయితే తాజా చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీతో పాటు హాలీవుడ్ న‌టుల స‌మ్మేళ‌నంగా నిర్మిస్తుండ‌టంతో `ఆర్ ఆర్ ఆర్‌` గురించి హాలీవుడ్ స్థాయిలో చెప్పుకుంటున్నారు. `బాహుబ‌లి`తో భార‌తీయులు కూడా హాలీవుడ్ చిత్రాల్ని నిర్మించ‌గ‌ల‌ర‌ని, గ్రాండ్ లుక్‌తో గ్రాఫిక్స్‌ని చూపించ‌గ‌ల‌ర‌ని నిరూపించ‌డంతో ఈ సినిమాపై అంద‌రి దృష్టి ప‌డింది.

అందుకు త‌గ్గ‌ట్టే సినిమాని స‌ర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌తో , అబ్బుర ప‌రిచే యాక్ష‌న్ ఘ‌ట్టాల‌తో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి సిద్ధం చేస్తున్నారు. ఇందులో హాలీవుడ్ న‌టుల‌తో పాటు బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. బ్రిటీష్ ఇండియా కాలం నాటి క‌థ‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌న్ బ్రిటీష్ పోలీస్ అధికారిగా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ట‌. ఇందు కోసం ఆయ‌న ఎలాంటి పారితోషికం ఆశించ‌లేద‌ని ఇటీవ‌ల వార్త‌లు వినిపించాయి.

అయితే సినిమాలో ఆయ‌న పాత్ర నిడివికి సంబంధించిన తాజా వార్త ప్ర‌స్తుతం ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అజ‌య్‌దేవ‌గ‌న్ పాత్ర నిడివి కేవ‌లం 30 నిమిషాల పాటు మాత్ర‌మే వుంటుంద‌ని, కానీ ప్రేక్ష‌కులు గుర్తుంచుకునే స్థాయిలో అత్యంత ప‌వ‌ర్‌ఫుల్‌గా సినిమాకు వ‌న్ ఆఫ్ ద హైలైట్‌గా వుంటుంద‌ని తాజాగా వినిపిస్తోంది.