అజయ్ దేవగన్ కూడా ఈ నెల నుండే ఆర్ ఆర్ ఆర్ లో…

అజయ్ దేవగన్ కూడా ఈ నెల నుండే ఆర్ ఆర్ ఆర్ లో...
అజయ్ దేవగన్ కూడా ఈ నెల నుండే ఆర్ ఆర్ ఆర్ లో…

ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ విషయంలో కీలక అప్డేట్ ను ఇచ్చాడు. త్వరలోనే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఉంటుందని తెలియజేసాడు. షూటింగ్ ఎలా చేయాలన్న విషయంలో ఇప్పటికే చాలా చర్చలు చేశామని, ఒక క్లారిటీ వచ్చిందని అన్నాడు రాజమౌళి. అయితే సినిమా రిలీజ్ విషయంలో ఇంకా ఏ విషయం చెప్పలేమని, ఎందుకంటే షూటింగ్ ఎలా జరుగుతుంది అన్న విషయంలో ఇంకా ఎటువంటి క్లారిటీ లేదని తెలియజేసాడు.

హైదరాబాద్ లోనే షూటింగ్ జరుగుతుందని, ఇప్పటికే నటీనటులకు షెడ్యూల్స్ విషయంలో క్లారిటీ ఇస్తున్నామని అన్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ పై కాంబినేషన్ సీన్స్ ను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటాడట. అజయ్ దేవగన్ ఎన్టీఆర్, చరణ్ లకు గురువు పాత్రలో కనిపిస్తున్న విషయం తెల్సిందే.

వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఆర్ ఆర్ ఆర్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ ను హీరోయిన్లుగా నటిస్తున్నారు.