“అజిత్ – బోనీ” బోణీ తర్వాత భారీ మూవీ


Ajith  boney combination new film
Ajith boney combination new film

బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ; తమిళ అగ్ర హీరో “తాలా” అజిత్ కుమార్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు, ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తీర్చి దిద్దబడుతోంది. ఇప్పటికే అజిత్ – బోనీ కాంబినేషన్ లో పింక్ సినిమా రీమేక్ అయిన నేర్కొండ పార్వై సినిమా ఘన విజయం సాధించింది. ఇక ఈ సినిమా ఒరిజినర్ స్క్రిప్ట్ కి అజిత్ ఇమేజ్ కు తగ్గట్లు కొన్ని మార్పులు చేసారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా కూడా ఇదే. ఇక అమితాబ్ మార్క్ ఎమోషన్స్ కి తనదైన హీరోఇజం తో అజిత్ సినిమాను టాప్ గేర్ లో చూపించాడు. ఇక ఈ సినిమా ప్రయాణంలో మంచి మిత్రులుగా మారిన బోనీ – అజిత్ లు మరొక సినిమా కూడా చేస్తున్నారు.

గతంలో కూడా బోనీ సర్ కోరిక మీదకు “తాలా” బోనీ సతీమణి, అలనాటి అందాల సుందరి అయిన శ్రీదేవి కమ్ బ్యాక్ మూవీ అయిన ఇంగ్లీష్ – వింగ్లీష్ సినిమాలో కూడా చిన్న అతిధి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఈ సినిమా యాక్షన్ సీన్స్ షూటింగ్ కోసం యూనిట్ తో కలిసి తాలా స్విట్జర్లాండ్ చేరుకున్నారు. అసలే మన అజిత్ సర్ వచ్చిందే మెకానికల్ ఫీల్డ్ నుండి… ! చిన్న పిల్లలు బొమ్మలతో ఆడుకున్నట్లు స్పోర్ట్స్ బైక్స్ తో, కార్లతో డూప్ లేకుండా స్టంట్స్, యాక్షన్, చేజింగ్ సీన్స్ చేస్తాడు అజిత్ సర్. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆయన బైక్ రైడింగ్ వీడియోస్ ఉంటాయి. ఇక ఈ సినిమాకు యాక్షన్ పార్ట్ మెయిన్ హైలెట్ అంటోంది టీం. ఏదైనా మొత్తం కోలీవుడ్ లో యాక్షన్ సీన్స్ అంటే ఇప్పటికీ ఎ.కె (అజిత్ కుమార్) ని మాత్రమే ఫ్యాన్స్ చెప్పుకుంటారు.