“తాలా” చూపు తెలుగు మార్కెట్ వైపు


“తాలా” చూపు తెలుగు మార్కెట్ వైపు
“తాలా” చూపు తెలుగు మార్కెట్ వైపు

ఆయన స్వతహాగా రేస్ కార్ డ్రైవర్. మోటార్ మెకానిక్. స్వయంగా ఆటోమొబైల్ స్పేర్స్ డిజైనింగ్ చెయ్యగలరు. అన్నిటికి మించి తమిళనాడులో రజనీకాంత్ తరువాత అంతటి ఫాలోయింగ్ ఉన్న నటుడు. ఆయన పేరు అజిత్ కుమార్. కానీ ఫ్యాన్స్ ముద్దుగా ఆయన్ను “తాలా” (యోధుడు, నాయకుడు) అని పిలుస్తారు. సినిమా ఇండస్ట్రీ లో కొంతమంది హీరోలు లేని జుట్టుకు నల్ల రంగు వేసుకుని మరీ విగ్గులుగా పెట్టుకుంటుంటే, అజిత్ మాత్రం ఉన్న జుట్టుకు కూడా “మంగాతా” సినిమా (తెలుగు లో గ్యాంబ్లర్) నుండి రంగు వెయ్యడం కూడా మానేసాడు. అయినా ఆయనకు ఉన్న ఫాలోయింగ్ తగ్గలేదు, సరికదా…! ఇంకా పెరిగింది.

తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో చేసిన “కాటమరాయుడు” సినిమా గతంలో అజిత్ చేసిన “వీరం” సినిమాకు రీమేక్. గత ఏడాది సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా “పేట” తోపాటు అజిత్ నటించిన “విశ్వాసం” సినిమా కూడా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఇక ఇటీవలే అజిత్ సర్, గతంలో అమితాబ్ బచ్చన్ చేసిన “పింక్” సినిమాను “నేర్కొండ పారవై” అనే పేరుతో రిమేక్ చేసి హిట్ కొట్టారు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆ సినిమాను రిమేక్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అజిత్ “ఖాకీ” సినిమా డైరెక్టర్ హెచ్. వినోత్ తో “వలిమై” చేస్తున్నారు, ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ చెయ్యబోతున్నారు. గతంలో కూడా అజిత్ “ప్రియురాలు పిలిచింది” అనే సినిమా లో కనిపించారు. తన సినిమా రిమేక్ రైట్స్ కి, డబ్బింగ్ లకి ఉన్న కలెక్షన్స్ చూసి అజిత్ ఇక తను కూడా తెలుగులోకి దిగాలని ఫిక్స్ అయిపోయారు. హెచ్. వినోత్ గతంలో తమిళనాడు పోలీస్ “ఆపరేషన్ ఓమా” అనే బ్యాక్ డ్రాప్ లో చేసిన “ఖాకీ” సినిమా తెలుగు లో సైతం ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినికా స్క్రీన్ ప్లే, టేకింగ్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక ఇప్పుడు అజిత్ తో చేసే ఈ సినిమా సైతం హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ దీపావళికి రెండు రోజులముందే నవంబర్ 12 న ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.