డైరెక్టర్ ని తిడుతున్న స్టార్ హీరో ఫ్యాన్స్


Ajith kumar fans angry on director siva

తమిళస్టార్ హీరో అజిత్ ఫ్యాన్స్ డైరెక్టర్ శివ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు . అదేంటి అజిత్ కు వీరమ్ , వేదలమ్ అనే రెండు హిట్స్ ఇచ్చిన దర్శకుడు శివ కాబట్టి అతడంటే అజిత్ ఫ్యాన్స్ ఇష్టపడాలి కానీ తిట్టడం ఏంటి అని అనుకుంటున్నారా ? అవును రెండు సినిమాలు హిట్స్ ఇవ్వడంతో అతడిపై నమ్మకంతో వివేకం అనే సినిమాకు ఛాన్స్ ఇచ్చాడు అజిత్ కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది కాకపోతే భారీ ఓపెనింగ్స్ వచ్చాయి తమిళనాట . దాంతో ఇప్పుడు ఏకంగా నాలుగో చాన్స్ ఇచ్చాడు అజిత్ . తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో ” విశ్వాసం ” అనే సినిమా రూపొందుతోంది . కాగా ఆ సినిమా ఫస్ట్ లుక్ వచ్చింది అయితే ఆ ఫస్ట్ లుక్ అజిత్ ఫ్యాన్స్ కు అస్సలు నచ్చలేదు దాంతో అజిత్ కు మరో ప్లాప్ ఇవ్వనున్నాడా ? అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అజిత్ ఫ్యాన్స్ .

విశ్వాసం చిత్రాన్ని 2019 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అజిత్ – శివ ల కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు చిత్రాలు రాగా రెండు హిట్స్ ఒకటి ప్లాప్ అయ్యింది . ఇక ఇప్పుడేమో ఫస్ట్ లుక్ పై విశ్వాసం లేకుండా పోవడంతో ఇది కూడా వివేకం లాగే ప్లాప్ అవుతుందేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు . తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అజిత్ ,విజయ్ లకే , విజయ్ ఏమో వరుస విజయాలు సాధిస్తుంటే అజిత్ ని కావాలని వెనక్కి నెట్టేలా చేస్తున్నారని డైరెక్టర్ ని తిడుతూన్నారు .

English Title: Ajith kumar fans angry on director siva