పూరి ఆకాశ్ కూడా ఒటీటికే సై అన్నాడా?

పూరి ఆకాశ్ కూడా ఒటీటికే సై అన్నాడా?
పూరి ఆకాశ్ కూడా ఒటీటికే సై అన్నాడా?

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి హీరోగా న‌టిస్తున్న చిత్రం `రొమాంటిక్‌`. అనిల్ పాతూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కేతిక శ‌ర్మ ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది. ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీకి పూరి జ‌గ‌న్నాథ్ క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు అందిస్తున్నారు. దీంతో ఈ మూవీపై అంచ‌నాలు నెల‌కొన్నాయి.

దీనికితోడు ఆ మ‌ద్య విడుద‌ల చేసిన ఫ‌స్ట్ సింగిల్లో కేతిక శ‌ర్మ చేసిన అందాల విందులో యూత్‌లో ఈ మూవీపై మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. అయితే లాక్‌డౌన్ త‌రువాత మ‌రిన ప‌రిణామాల దృష్ట్యా ఈ మూవీ రిలీజ్ ఆగిపోయింది. చిత్రీక‌ర‌ణ పూర్త‌యి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని చివ‌రికి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నార‌ట‌.

ఇప్ప‌టికే ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌తో మేక‌ర్స్ ఒప్పందం కుదుర్చుకున్నార‌ని తెలిసింది. మాఫియా నేప‌థ్యంలో ఓ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు మ‌ర‌రంద్ దేశ్ పాండే కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్‌ల‌పై పూరి జ‌గ‌న్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.