సునీల్ ని టార్గెట్ చేసిన ఆకాష్sunil-and-akash
sunil-and-akash

నటుడు సునీల్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసాడు నటుడు ఆకాష్ . ఒకప్పుడు హీరోగా నటించిన ఆకాష్ కు ఇప్పుడు చేతిలో సినిమాలు లేవు దాంతో ఇలా విమర్శలు చేసి వార్తల్లోకి ఎక్కాలని చూస్తున్నాడేమో ! ఇస్మార్ట్ శంకర్ కథ నాదే ! దాన్ని కాపీ కొట్టి తీశారు , నన్ను మోసం చేసారు అంటూ మీడియా ముందు వాపోయాడు ఆకాష్ .

అంతేనా హీరోగా నటించిన సునీల్ అందాల రాముడు చిత్రంలో నన్ను నటించమని బ్రతిమిలాడాడు , దాంతో ఆ సినిమాలో నటించాను కానీ నా పాత్ర నిడివి తగ్గించారు అలాగే అంతకుముందు నన్ను భయ్యా అని పిలిచేవాడు ఆ తర్వాత ఏం ఆకాష్ అంటూ ఏకవచనంతో సంబోదించాడని అతడికి కృతజ్ఞత లేదని విమర్శలు చేస్తున్నాడు . అయినా ఇప్పుడు ఇలా మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తే ఏమొస్తుంది ?