స్మోకింగ్ మానేశానంటున్న అఖిల్

Akhil about his smoking habitఇంతకుముందు సిగరెట్లు విపరీతంగా తాగేవాడ్ని కానీ ఇప్పుడు స్మోకింగ్ మానేసానని అంటున్నాడు హీరో అక్కినేని అఖిల్ . ఈ హీరో తాజాగా నటించిన చిత్రం మిస్టర్ మజ్ను ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే . ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన మిస్టర్ మజ్ను కు హిట్ టాక్ రాలేదు దాంతో ప్రమోషన్ చేస్తూ బాగానే కష్టపడుతున్నాడు అఖిల్ .

స్మోకింగ్ అలవాటు మంచిది కాదని నేను మానేసాను అలాగే స్మోక్ చేసేవాళ్లు పూర్తిగా మానేయండి అది మంచి అలవాటు కాదంటూ కోరుతున్నాడు అఖిల్ . నాన్న నాగార్జున మాకు తండ్రిలా కాకుండా ఓ మంచి ఫ్రెండ్ లా ఉంటాడని చెబుతున్నాడు అఖిల్ . నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు . అయితే అఖిల్ ఎంతగా పోరాడుతున్నప్పటికీ పాపం సక్సెస్ మాత్రం దక్కడం లేదు .

English Title: Akhil about his smoking habit