స్పీడు పెంచిన అఖిల్ అక్కినేని!


స్పీడు పెంచిన అఖిల్ అక్కినేని!
స్పీడు పెంచిన అఖిల్ అక్కినేని!

స్టార్ హీరోల నుంచి అప్ క‌మింగ్ హీరోల వ‌రకు సినిమాల విష‌యంలో స్పీడు పెంచారు. ప్ర‌భాస్ , ప‌వ‌న్‌క‌ల్యాణ్ .. ఇలా ప్ర‌తీ హీరో ఇప్పుడు రెండు మూడు ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా వున్న విష‌యం తెలిసిందే. ఇదే జాబితాలో అక్కినేని వార‌బ్బాయి అఖిల్ అక్కినేని కూడా చేరారు.

అఖిల్ అక్కినేని స్పీడు పెంచారు. సినిమాల పరంగా కాస్త రేసులో వెన‌క‌బ‌డి వున్న అఖిల్ బ్యాక్ టు  బ్యాక్ సినిమాలు అంగీక‌రిస్తూ వాటిని వ‌రుస‌గా ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ మూవీ స‌మ్మ‌ర్‌కి రిలీజ్ కాబోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.

స్పై థ్రిల్ల‌ర్ గా రూపొంద‌నున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది. కాగా ఈ మూవీతో పాటు తాజాగా అఖిల్ మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. సంచ‌ల‌నం సృష్టించిన  `ది ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్ డైరెక్ట‌ర్స్ రాజ్ ఎన్ డీకేల‌తో ఓ భారీ చిత్రాన్ని చేయ‌బోతున్నార‌ట‌. పాన్ ఇండియా స్థాయిలో రూపొంద‌నున్న ఈ మూవీని వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి. అశ్వ‌నీద‌త్ నిర్మించ‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.