అఖిల్ ఇలా షాకిచ్చేశాడేంటి?


 

Akhil Akkineni Most eligible bachelor first look
Akhil Akkineni Most eligible bachelor first look

అఖిల్ అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు నాలుగేళ్లు పూర్త‌య్యాయి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అఖిల్ నుంచి చెప్పుకోద‌గ్గ ఒక్క హిట్ సినిమా కూడా రాలేదు. క‌థ‌ల ఎంపిక విష‌యంలో వేస్తున్న త‌ప్ప‌ట‌డుగులే ఇందుకు కార‌ణంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌రుకు అఖిల్ మూడు చిత్రాల్లో న‌టించారు. అందులో ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది.

అఖిల్‌, హ‌ల్లో, మిస్ట‌ర్ మ‌జ్ను ఈ మూడు చిత్రాల క‌థ‌లు రొటీనే. అందుకే అవి ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌లేక‌పోయాయి. దీంతో కొంత విరామం తీసుకున్న అఖిల్ లేట్ అయినా లేటెస్ట్‌గా రావాల‌ని, ఈ ద‌ఫా ఎలాగైనా సూప‌ర్‌హిట్‌ని సొంతం చేసుకోవాల‌ని ఫిక్స‌య్యార‌ట‌. అందులో భాగంగానే ఆయ‌న బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌లో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` చిత్రాన్ని చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

జీఏ2 బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల టైటిల్‌ని ప్ర‌క‌టించిన చిత్ర బృందం శ‌నివారం హీరో అఖిల్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసింది. కాళ్ల‌కి చెప్పులు లేకుండా, త‌ల‌కి మంకీ క్యాప్‌తో విషాద‌క‌రంగా చూస్తూ న‌బుస్తూ వెళుతున్న లుక్ ఆక‌ట్టుకుంటోంది. ఇంత‌కు ముందు చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఇందులో అఖిల్ క‌నిపిస్తున్నాడు. సినిమా కూడా ఫ‌స్ట్‌లుక్ త‌ర‌హాలోనే పూర్తి కొత్త పంథాలో వుంటుంద‌ని తెలుస్తోంది. ఫ్లాపుల్లో వున్న బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌కు, అఖిల్‌కు ఈ సినిమాతో హిట్ అవ‌స‌రం. ఆ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న‌ట్టు తెలిసింది.