అయ్యగారి (అఖిల్) సినిమాకి ఆయనే కరెక్టు


Akhil akkineni new movie with Abhimanyudu Director Mithran
Akhil akkineni new movie with Abhimanyudu Director Mithran

అల్ ఇండియా సూపర్ హీరో అయ్యగారు అఖిల్ బాబు రేంజ్ ని మ్యాచ్ చేసే డైరెక్టర్ లు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఇప్పటివరకు మూడు సార్లు మన నాగార్జున గారు మా అయ్యగారిని ప్రతి సారి కొత్తగా లాంచ్ చేస్తున్నాని చెప్పి, ముగ్గురు డైరెక్టర్ లను ట్రై చేసారు. కానీ వాళ్ళలో ఎవరికీ అయ్యగారి రేంజ్ అర్ధం కాలేదు.

మొదటి సినిమాకి ఇప్పటివరకూ టాలీవుడ్ లో మాస్ హీరోలను పరిచయం చేసే V.V వినాయక్ కి సినిమా ఇచ్చారు. గురువు గారు maximum ట్రై చేసారు. కానీ అయ్యగారికి ఆ కథ సెట్ అవ్వలేదు. రెండో సినిమాగా ఎప్పుడూ, గడియారాలు బాగుచేసుకునే స్క్రిప్ట్ లు రాసే తమిళ్ తంబి విక్రం కుమార్ కి ఇచ్చారు. హలో అంటూ ఆయన మా అయ్యగారితో చేసిన సినిమా స్క్రీన్ ప్లే బాగున్నా, మాకు ఎక్కలేదు. మూడో సినిమా తొలిప్రేమ చేసిన వెంకీ అట్లూరి మా అయ్యగారితో చేసిన Mr. మజ్ను గురించి తలుచుకుంటే మాకు ఊరికే బూతులు రావు అన్న విషయం తెలుస్తుంది.

ఇక మా అయ్యగారి డై హార్డ్ ఫాన్స్ అందరూ కలిసి అక్కినేని ఫ్యామిలీ కి ప్రేమతో పంపించిన రిక్వెస్ట్ లు అన్నీ చూసిన తరువాత, మళ్ళీ ఇప్పుడు నాలుగో సారి బొమ్మరిల్లు భాస్కర్ తో నాలుగో సినిమా చేస్తున్నాడు మా అఖిల్ బాబు. ఈ సారి రీ లాంచ్ ; రీ రీ లాంచ్ అనకుండా అయ్యగారిని ప్రశాంతంగా సినిమా చేసుకోనిమ్మని నాగ్ సార కి చెప్పాం.

అఖిల్ బాబు ఐదో సినిమా తమిళ్ డైరెక్టర్ P.S మిత్రన్ తో ఖాయం అయినట్టు తెలుస్తోంది. మిత్రన్ సార్ ఎవరో కాదు, మన విశాల అన్నతో తమిళ్ లో ఇరుమ్బుతేరై (తెలుగులో అభిమన్యుడు) లాంటి ఇండస్ట్రీ హిట్ తీసిన వ్యక్తి. ప్రస్తుతం శివ కార్తికేయన్ తో “హీరో” అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం అయ్యగారు కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమాలు అయిపోయాక వీళ్ళు ఇద్దరూ కలిసి సినిమా మొదలుపెట్టే అవకాశం ఉంది.

ఏది ఏమైనా మళ్ళీ చెప్తున్నాం. అఖిల్ NO 1, ఇండస్ట్రీ కి ఎవరు వచ్చినా అయ్యగారే కరెక్టు.