బిగ్ అనౌన్స్‌మెంట్ : అఖిల్ – సురేంద‌ర్‌రెడ్డి ఫిల్మ్ ఫిక్స్‌!


బిగ్ అనౌన్స్‌మెంట్ : అఖిల్ - సురేంద‌ర్‌రెడ్డి ఫిల్మ్ ఫిక్స్‌!
బిగ్ అనౌన్స్‌మెంట్ : అఖిల్ – సురేంద‌ర్‌రెడ్డి ఫిల్మ్ ఫిక్స్‌!

మ‌మేష్‌బాబుతో ఈ ఏడాది ప్రారంభంలో `స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించిన ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధినేత అనిల్ సుంక‌ర వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్ట్‌ల‌ని ప్ర‌క‌టిస్తున్నారు. ఇటీవ‌లే శ‌ర్వానంద్‌, అజ‌య్ భూప‌తిల `మ‌హా స‌ముద్రం` ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించిన అనిల్ సుంక‌ర అనుకున్న‌ట్టే డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డిల ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించారు.

ర‌చ‌యిత‌, డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ అందించిన ప‌వ‌ర్‌ఫుల్ క‌థ‌తో ఈ చిత్రాన్ని ఓ స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించ‌బోతున్నారట‌. `సైరా న‌ర‌సింహారెడ్డి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత సురేంద‌ర్‌రెడ్డి చేయ‌బోతున్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈమూవీకున్న మ‌రో విశేషం ఏంటంటే ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి కూడా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సుంక‌ర రామ‌బ్ర‌హ్మంతో క‌లిసి స‌రెండ‌ర్ 2 సినిమా బ్యాన‌ర్‌పై సురేంద‌ర్‌రెడ్డి ఓ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు.

అఖిల్ న‌టించ‌నున్న 5వ చిత్ర‌మిది. స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌పైకి రానున్న ఈ చిత్రంలో త‌న గ‌త చిత్రాల‌కు మించి అఖిల్‌ని మ‌రింత‌ స్టైలిష్ గా ప్ర‌జెంట్ చేయ‌బోతున్నార‌ట‌. ఈ చిత్రానికి సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని త్వ‌రలోనే వెల్ల‌డించ‌నున్న‌ట్టు చిత్ర బృందం వెల్ల‌డించింది. ఈ చిత్రానికి స‌హ‌నిర్మాత అజ‌య్ సుంక‌ర‌, ప‌తిదీపారెడ్డి, ెగ్జిక్యూటివ్ నిర్మాత కిషోర్ గ‌రిక‌పాటి.