సురేంద‌ర్‌రెడ్డి – అఖిల్ మూవీ లాంఛ్ కి డేట్ ఫిక్స్‌!

Akhil Akkineni - Surender Reddy`s Crazy Project to start from April 7
Akhil Akkineni – Surender Reddy`s Crazy Project to start from April 7

యంగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి కాంబినేష‌న్‌లో ఓ భారీ చిత్రం తెర‌పైకి రాబోతున్న విష‌యం తెలిసిందే. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తో క‌లిసి డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి స‌రెండ‌ర్ 2 సినిమా బ్యాన‌ర్స్ పై అనిల్ సుంక‌ర, సురేంద‌ర్‌రెడ్డి ఈ భారీ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. ఈ మూవీ ప్ర‌క‌టించి దాదాపు నాలుగు నెల‌లు కావ‌స్తోంది. కానీ ఇంత వ‌ర‌కు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ బ‌య‌టికి రాలేదు.

ఎట్ట‌కేల‌కు ఈ చిత్రాన్నిఅఖిల్ పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందు అంటే ఏప్రిల్ 7న లాంఛ‌నంగా ప్రారంభిస్తున్నారు. అఖిల్ బ‌ర్త్‌డే ఏప్రిల్ 8న జ‌ర‌గ‌బోతోంది. దానికి ఒక్క రోజు ముందే ఈ మూవీని అట్ట‌హాసంగా ప్రారంభించ‌బోతున్నారు. హాలీవుడ్ స్టైల్లో స్పైథ్రిల్ల‌ర్‌గా రూపొంద‌నున్న ఈ మూవీ కోసం హాలీవుడ్ ఫైట‌ర్స్‌ని, ఫైట్ మాస్ట‌ర్‌ని సురేంద‌ర్‌రెడ్డి ఇప్ప‌టికే ఫైన‌ల్ చేశారు.

ఇక హీరోయిన్‌గా సాక్షీ వైద్య అనే మోడ‌ల్‌ని ఫైన‌ల్ చేస్తున్నార‌ట‌. త‌మ‌న్ సంగీతం అందించ‌నున్న ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ని వ‌చ్చే నెల నుంచే ప్రారంభించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. అఖిల్ ప్ర‌స్తుతం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ రూపొందిస్తున్న ఈ మూవీ జూన్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.