సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న అఖిల్


Akhil has missed super hit filmఅక్కినేని అఖిల్ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్నాడు ఇక ఇప్పుడేమో హిట్ కోసం తపించి పోతున్నాడు పాపం ! ఇంతకీ అఖిల్ మిస్ చేసుకున్న హిట్ సినిమా ఏదో తెలుసా …… శర్వానంద్ హీరోగా నటించిన మహానుభావుడు . అవును వినడానికి విచిత్రంగా అనిపించినప్పటికీ మహానుభావుడు అనే సినిమాని మొదట అఖిల్ తోనే తీయాలని అనుకున్నాడట దర్శకులు మారుతి , అయితే ఆ సమయంలో అఖిల్ హలో చిత్రంతో బిజీ గా ఉన్నాడు దాంతో శర్వానంద్ తో చేయాల్సి వచ్చిందని లేకపోతే అఖిల్ చేయాల్సిన సినిమా అని అంటున్నాడు ఇప్పుడు .

అఖిల్ అన్న నాగచైతన్య హీరోగా శైలజారెడ్డి అల్లుడు సినిమా చేసిన విషయం తెలిసిందే . మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 13న విడుదల అవుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన మారుతి అఖిల్ మహానుభావుడు చిత్రం గురించి చెప్పుకొచ్చాడు . ఇక శైలజారెడ్డి అల్లుడు విషయానికి వస్తే తప్పకుండా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు మారుతి .

English Title: Akhil has missed super hit film