అక్కినేని అఖిల్ తర్వాతి చిత్రం రీమేకా?Akhil in consideration for a remake
Akhil in consideration for a remake

ఎంతో ప్రామిసింగ్ గా అనిపించాడు అక్కినేని అఖిల్ డెబ్యూకి ముందు. మనం సినిమాలో ఒక నిమిషం పాటు కామియో రోల్ లో కనిపించినప్పుడు అతని స్క్రీన్ ప్రెజన్స్ కు మహేష్ లాంటి స్టార్ హీరో కూడా ఇంప్రెస్ అయ్యాడు. అఖిల్ చాలా పెద్ద స్టార్ అవుతాడని చెప్పాడు. అయితే మొదటి సినిమా చాలా గ్రాండ్ గా లాంచ్ అయినా, అఖిల్ దారుణమైన ప్లాప్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు హలో, mr. మజ్ను కూడా ప్లాప్స్ కావడంతో అఖిల్ ఇప్పుడు కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. ఎలాగైనా తన నాలుగో చిత్రంతోనైనా తన తొలి హిట్ ను అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

తన నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచలర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ నిన్ననే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కాళ్లకు రక్షణ లేకుండా వీధుల్లో అఖిల్ రగ్గడ్ లుక్ లో నడుస్తూ మెప్పించాడు. ఇక ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానున్న నేపథ్యంలో తన తర్వాతి సినిమా ఏంటనే దానిపై ఇప్పటికే భిన్నమైన ఊహాగానాలు ఉన్నాయి.

ప్లాప్స్ లో ఉన్నా కూడా క్రేజ్ ఉన్న హీరో అఖిల్. అందుకే తన చేతిలో రెండు, మూడు చిత్రాలు ఉన్నాయి. వాటిలో దేనికి ఓకే చెపుతాడో చూడాలి. తమిళ దర్శకుడు పిఎస్ మిత్రన్ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రానికి అఖిల్ ను హీరోగా అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం అఖిల్ ను ఒక బాలీవుడ్ రీమేక్ కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఇటీవలే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన బదాయి హో చిత్ర రీమేక్ హక్కులను దక్కించుకున్నాడు. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా, ఆ పాత్రకు అఖిల్ ను అనుకుంటున్నారు. మరి ఈ రీమేక్ కు అఖిల్ ఎస్ అంటాడా? సెటైరికల్ కామెడీగా తెరకెక్కిన ఆ చిత్ర రీమేక్ లో నటిస్తాడా అన్నది చూడాలి.