అఖిల్ మిస్టర్ మజ్ను


akhil new title mistar majnuఅక్కినేని అఖిల్ హీరోగా తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఎక్కువ భాగం విదేశాలలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ” మిస్టర్ మజ్ను ” అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది . కింగ్ నాగార్జున కెరీర్ ప్రారంభంలో నటించిన చిత్రం” మజ్ను ”. భగ్న ప్రేమికుడిగా నాగార్జున నటించి అఖండ విజయాన్ని అందుకున్నాడు అంతేకాదు అంతకుముందు వరకు నాగార్జున ఏంటి ? హీరో ఏంటి ? అతడి నటన ఏంటి ? అని విమర్శించిన వాళ్లకు తన నటనకు మెరుగులు దిద్ది సరికొత్త గా కనిపించాడు నటుడిగా . అలాగే భారీ విజయాన్ని అందుకొని హీరోగా నిలదొక్కున్నాడు .

కట్ చేస్తే ఇప్పుడు అఖిల్ నటించేది మూడో సినిమా అయినప్పటికీ మొదటి చిత్రం అఖిల్ డిజాస్టర్ అవ్వడంతో షాక్ అయ్యాడు , ఇక రెండో సినిమా హలో లో నటించినప్పటికీ అది కమర్షియల్ హిట్ కాదు దాంతో అఖిల్ హీరోగా నిలదొక్కుకోవడం కష్టమే అని గుసగుసలు వినబడుతున్నాయి సరిగ్గా అలాంటి సమయంలో తొలిప్రేమ వంటి హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రేమకథా చిత్రం చేస్తున్నాడు . ఈ సినిమాకు ” మిస్టర్ మజ్ను ” అనే టైటిల్ దాదాపుగా ఖరారు చేసారని వినికిడి . ఇక ఈ సినిమాతో తండ్రి లాగే పెద్ద హిట్ కొట్టి హీరోగా తనని తానూ ప్రూవ్ చేసుకుంటాడేమో చూడాలి .

English Title: akhil new title mistar majnu