మొత్తానికి అఖిల్ కొత్త సినిమా ఖరారయ్యింది


akhil next movie with venky atluriఅక్కినేని అఖిల్ మనంతో భారీ అంచనాలు పెంచినప్పటికీ అఖిల్ చిత్రంతో సోలో హీరోగా వచ్చి దారుణంగా దెబ్బ తిన్నాడు దాంతో తీవ్ర తర్జన భర్జన అనంతరం విక్రమ్ దర్శకత్వంలో హలో చిత్రంలో నటించాడు అయితే ఆ సినిమా సక్సెస్ ని ఇవ్వలేదు కానీ అఖిల్ కు కాస్త ఊరటనిచ్చింది . ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ ఏ సినిమా చేయాలో తేల్చుకోలేకపోయాడు అఖిల్ . కానీ ఎట్టకేలకు తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించడానికి సిద్దమయ్యాడు .

 

హీరోగా పరిచయమైన వెంకీ ఆ తర్వాత మెగా ఫోన్ చేతబట్టి తొలిప్రేమ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు . ఆ తర్వాత నాగార్జున ని కలిసి వెంకీ చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నాడట దాంతో అఖిల్ – వెంకీ ల కాంబినేషన్ లో ఈనెల 26న కొత్త సినిమా ప్రారంభం అవుతోంది . ఇక ఈ చిత్రాన్ని భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నాడు .