అఖిల్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ చేసేసారు

 

Akhil next titled most eligible bachelor
Akhil next titled most eligible bachelor

అఖిల్ అక్కినేని.. మనం సినిమాలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అందరూ ఫ్యూచర్ స్టార్ అన్నారు. అఖిల్ తొలి సినిమా వేడుకలో మహేష్ బాబు పాల్గొని అఖిల్ కు స్టార్ హీరో అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు మాట్లాడాడు. ఫ్యూచర్ లో నిజంగానే అవ్వోచ్చేమో కానీ ఆ దిశగా తొలి అడుగులు అయితే పడలేదు. అఖిల్ నటించిన తొలి మూడు సినిమాలు అఖిల్, హలో, mr. మజ్ను సినిమాలు దేనికవే ప్లాపులుగా నిలిచాయి. తొలి మూడు సినిమాలతోనే హ్యాట్రిక్ ప్లాపులు సాధించిన అఖిల్ బాగా అప్సెట్ అయ్యాడు. కెరీర్ లో కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. నిజానికి భాస్కర్ కు కూడా తెలుగులో ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేదు. అయినా కానీ భాస్కర్ చెప్పిన కథను నమ్మి అఖిల్ ఈ సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాత కావడంతో ట్రేడ్ వర్గాల్లో ఒకింత భరోసా వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉంటే షూటింగ్ తుదిదశకు చేరుకున్న ఈ సినిమాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు గత రెండు రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఈరోజు చిత్ర టీమ్ అధికారికంగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ఈ సినిమాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసేసారు. దానికి సంబంధించిన ప్రీ లుక్ కూడా వదిలారు. ఈ సినెమా ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 8న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తుండగా పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.