హ్యాట్రిక్ ప్లాపుల హీరోతో హిట్ దర్శకుడు


హ్యాట్రిక్ ప్లాపుల హీరోతో హిట్ దర్శకుడు
హ్యాట్రిక్ ప్లాపుల హీరోతో హిట్ దర్శకుడు

ఎన్నో అంచనాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అక్కినేని అఖిల్. అయితే కథల ఎంపికలో లోపమో మరొకటో తెలియదు కానీ అఖిల్ మూడు సినిమాలు చేసినా హిట్ మాట విని ఎరుగడు. చేసిన మూడు సినిమాలు చేదు ఫలితాల్ని అందించిన నేపథ్యంలో అఖిల్ నాలుగో చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రం చిత్రీకరణలో ఉండగానే అఖిల్ తన ఐదవ సినిమాను పట్టాలెక్కించినట్లు తెలుస్తోంది.

గీత గోవిందం సినిమాతో తిరుగులేని హిట్ కొట్టాడు దర్శకుడు పరశురామ్. అయితే ఆ చిత్రం తర్వాత ఏడాదిన్నరకుపైగా గ్యాప్ వచ్చింది. అయినా మరో సినిమాను సెట్ చేసుకోలేకపోయాడు. మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా అనుకున్నా కానీ ఎందుకో అది సెట్ అవ్వలేదు. ఇప్పుడు పరశురామ్ అఖిల్ కోసం కొత్త కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

త్వరలో అఖిల్, నాగార్జునకు నరేషన్ ఇవ్వనున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే అఖిల్ నాలుగో చిత్రం పూర్తవ్వగానే ఇది సెట్స్ పైకి వెళుతుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.