అఖిల్ కు పెద్ద షాక్ : మిస్టర్ మజ్ను లీక్


Akhil's Mr Majnu full movie leaked online

అక్కినేని అఖిల్ కు పెద్ద షాక్ తగిలింది , మిస్టర్ మజ్ను సినిమా మొత్తం లీక్ కావడం…… అది కూడా హెచ్ డి ప్రింట్ లీక్ కావడంతో ఖంగుతిన్నారు . అసలే మిస్టర్ మజ్ను చిత్రానికి పెద్దగా పాజిటివ్ టాక్ లేదు దానికి తోడు ఇలా పైరసీ బారిన పడటం అంటే ఇంకా సినిమా కు పెద్ద నష్టమే !అని కొత్తగా చెప్పాలా ? ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ లో సాగతీత సన్నివేశాలతో ప్రేక్షకులు అసహనానికి గురి అవుతున్నారు.

గతకొంత కాలంగా తమిళ రాకర్స్ స్టార్ హీరోల చిత్రాలను , కాస్త పేరున్న చిత్రాలను మొదటి రోజునే లీక్ చేస్తూ దర్శక నిర్మాతలకు, హీరోలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు . ఇప్పటికే పలు చిత్రాలు లీక్ కాగా వాటి సరసన మిస్టర్ మజ్ను కూడా చేరింది . అఖిల్ కు ఈ సినిమా కూడా దెబ్బకొట్టింది . మిస్టర్ మజ్ను నిన్ననే విడుదలైన విషయం తెలిసిందే .

English Title: Akhil’s  Mr Majnu full movie leaked online