అక్కడొకడుంటాడు రివ్యూ


akkadokaduntadu movie review

అక్కడొకడుంటాడు రివ్యూ :
నటీనటులు : రామ్ కార్తీక్ , దీపిక , శివ కంఠగమనేని
సంగీతం : సార్క్స్
నిర్మాతలు : శివ శంకర్ రావు , వెంకటేశ్వర్ రావు
దర్శకత్వం : శ్రీపాద విశ్వక్
రేటింగ్ : 3/5
రిలీజ్ డేట్ : 1ఫిబ్రవరి 2019

 

రామ్ కార్తీక్దీపిక జంటగా శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో శివశంకర్ రావువెంకటేశ్వర్ రావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ”అక్కడొకడుంటాడు ”. బ్లాక్ మనీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా అన్నది చూద్దామా .

కథ :

పేరు మోసిన రాజకీయ నాయకుడైన కెకె ( రవిబాబు ) దగ్గర కోట్ల కొద్దీ బ్లాక్ మనీ ఉందన్న విషయం తెలుసుకున్న కార్తీక్ , వంశీ , నిత్యా , ఆది , సత్య లు ఆ డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేస్తారు . ఆ బ్లాక్ మనీ కొట్టేసే క్రమంలో కళ్ళు లేని యోగి (శివ కంఠగమనేని ) ఆ దోపిడీ ని అడ్డుకుంటాడు . అసలు వీళ్లకు ఆ బ్లాక్ మనీ గురించి ఎలా తెలిసింది ? ఆ కళ్ళు లేని యోగి ఎవరు ? ఆ బ్లాక్ మనీ కి అతడు ఎందుకు కాపలాగా ఉన్నాడు ? చివరకు ఆ బ్లాక్ మనీ ఏమయ్యింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

బ్లాక్ మనీ లైన్
శివ కంఠగమనేని
రామ్ కార్తీక్
వంశీ
నిత్యా , ఆది
సత్య
సంగీతం
విజువల్స్

డ్రా బ్యాక్స్ :

కొన్ని సన్నివేశాలు

నటీనటుల ప్రతిభ :

అయిదుగురు నటీనటులు తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు . హాస్య సన్నివేశాలు మాత్రమే కాకుండా యాక్షన్ సీన్స్ లో కూడా రాణించారు . ఇక శివ యోగి పాత్రలో అద్భుతంగా నటించాడు . ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కానీ మిగతా సన్నివేశాల్లో కూడా శివ మంచి పెర్ఫార్మెన్స్ ప్రదర్శించాడు . రాజకీయ నాయకుడి పాత్రలో ఎప్పటి లాగే రవిబాబు అదరగొట్టాడు .

సాంకేతిక వర్గం :

ఛాయాగ్రాహకులు రాజశేఖరన్ అందించిన విజువల్స్ బాగున్నాయి , పాటలతో పాటుగా నేపథ్య సంగీతం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది . నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు శ్రీపాద విశ్వక్ విషయానికి వస్తే …… బ్లాక్ మనీ అంశాన్ని ఎంచుకొని ఆసక్తికరమైన కథనంతో ప్రేక్షకులను అలరించాడు .

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Akhil's Mr Majnu full movie leaked onlineHero Dhanush romance with senior heroineMalaika arora driver leaked her affairNagarjuna feared with NTR biopicPoor TRP Rating for Jr NTR 's Aravinda SamethaBollywood hero rajkumar rao crush on Aishwarya rai