తెలుగు సినిమాకే దిక్కులేదు హిందీ లో చేస్తాడట


akkineni akhil next film plans in bollywood

అక్కినేని అఖిల్ తెలుగులో ఇప్పటివరకు మూడు చిత్రాలు చేయగా మనం సూపర్ హిట్ అయితే ఆ సినిమాని పక్కన పెడితే మిగతా సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు దాంతో ఇప్పుడు వెంకీ అట్లూరి అనే హిట్ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు . అయితే అఖిల్ కు హిట్ లేనప్పటికీ అప్పుడే బాలీవుడ్ లో కూడా సినిమా చేయాలనీ చూస్తున్నాడట ! తెలుగు సినిమాకే దిక్కు లేదు హిందీ సినిమా అని గుసగుసలు వినిపిస్తుంటే అందరూ నవ్వుతున్నారు . ముందు తెలుగులో సోలోగా హిట్ కొట్టాక అప్పుడు బాలీవుడ్ వైపు వెళ్ళొచ్చు కానీ ఇక్కడ హిట్టుకే దిక్కు లేదు బాలీవుడ్ సినిమానా ? అని అంటున్నారు .

ఆది పినిశెట్టి సోదరుడు సత్య ప్రభాస్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో ఓ సినిమాని తెరకెక్కించడానికి నాగార్జున సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది . అయితే అఖిల్ తెలుగులో సక్సెస్ అయ్యాక బాలీవుడ్ బాట పడితే బాగుంటుంది అంతేకాని ఇక్కడ కొట్టకుండా అక్కడ చేస్తే ఎగతాళి చేస్తుంటారు . అఖిల్ , హలో చిత్రాలు చేయగా అఖిల్ డిజాస్టర్ అయ్యింది , హలో కాస్త ఫరవాలేదు కానీ అది ఏమంత హిట్ కాదు దాంతో తొలిప్రేమ వంటి హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అఖిల్ . మరి ఆ సినిమా ఏమౌతుందో చూడాలి .

English Title: akkineni akhil next film plans in bollywood