యంగ్ హీరోకి తల్లిగా స్టార్ హీరో వైఫ్Akkineni amala playing sharwanand mother role
Akkineni amala playing sharwanand mother role

సీనియర్ హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో కుర్ర హీరోలకు తల్లిగా కనిపిస్తూ చక్కటి నటనను కనబరుస్తున్నారు. రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై మెరిస్తున్న వారిలో అమలా అక్కినేని ఒకరు. పాత్ర నచ్చితే గాని ఒకే చెప్పని ఈ స్టార్ హీరో వైఫ్ ఇప్పుడు మరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2012లో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో కనిపించిన అమల ఆ తరువాత మనం సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది.

ఇక ఐదేళ్ల అనంతరం మరో సినిమా చేయడానికి ఆమె ఒప్పుకున్నట్లు సమాచారం. యువ కథానాయకుడు శర్వానంద్ కొత్త దర్శకుడు శ్రీ కార్తిక్ కాంబినేషన్ లో ఒక డిఫరెంట్ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాలో పెళ్లి చూపులు ఫెమ్ రీతూ వర్మ హీరోయిన్ నటిస్తోంది. ఇకపోతే సినిమాలో అమలా అక్కినేని శర్వానంద్ కి తల్లి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ని ఇటీవల హైదరాబాద్ లో మొదలుపెట్టారు.
యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ తండ్రి రవి రాఘవేందర్ కూడా సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. నేడు జరిగిన షూటింగ్ లో అమల అక్కినేనితో పాటు రవి కూడా పాల్గొన్నారు. ఇక శర్వానంద్ ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పడి పడి లేచే మనసు – రణరంగం వంటి సినిమాలు  వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలవడంతో నెక్స్ట్ సినోమాలతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని శర్వా కష్టపడుతున్నాడు.