అక్కినేని బయోపిక్ తీస్తారట


Akkineni biopic on cards

టాలీవుడ్ లో బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇక తెలుగునాట బయోపిక్ లు అనూహ్యంగా పెద్ద ఎత్తున చిత్రీకరిస్తున్నారు. ఇక అక్కినేని సమకాళీకుడైన ఎన్టీఆర్ , సావిత్రి బయోపిక్ లు తెరకెక్కడంతో నాగార్జున కు అక్కినేని బయోపిక్ పై మనసు మళ్లిందట. నాగార్జున అక్కినేని బయోపిక్ తీయాలని అనుకోవడానికి కారణం ఏంటో తెలుసా……

 

ఎన్టీఆర్ బయోపిక్ లో సుమంత్ అక్కినేని గా నటించి యావత్ తెలుగు ప్రేక్షకులను అలరించడమే. కొన్నాళ్ల క్రితం వరకు అక్కినేని బయోపిక్ తీసే ఆలోచన లేదని చెప్పిన నాగార్జున తాజాగా తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకున్నాడట. అక్కినేని పాత్రలో సుమంత్ అద్భుతమైన నటనా ప్రదర్శన చేయడంతో అక్కినేని బయోపిక్ చేయాలని డిసైడ్ అయ్యాడట నాగార్జున.

English Title: Akkineni biopic on cards