అక్కినేని ఫ్యామిలీ సెల‌బ్రేష‌న్‌ టైమ్‌!


Akkineni family celebretion time
Akkineni family celebretion time

సినిమాల్లో న‌చ్చిన హీరోలు క‌లిసి న‌టిస్తే ఆ దృశ్యాన్ని చూడ‌టానికి ఎగ‌బ‌డుతుంటాం. అదే హీరోల ఫ్యామిలీ అంతా ఒక చోట చేరితే ఇంకేమైనా వుందా.. ఆ దృశ్యాన్ని చూసి ఎగిరిగంతులేస్తాం. ప్ర‌స్తుతం ఇదే సంబ‌రాన్ని అక్కినేని ఫ్యామిలీ హీరోలు జ‌రుపుకుంటున్నారు. ఎప్పుడూ ఫంక్ష‌న్‌ల‌లో హీరోల‌ని మాత్ర‌మే చూఇ ఆనందించే అభిమానుల‌కు అక్కినేని ఫ్యామిలీ సెల‌బ్రేష‌న్‌కు సంబంధించిన ఫొటో ఒక‌టి బ‌య‌టికి రావ‌డంతో అక్కినేని ఫ్యామిలీ అభిమాన‌ల ఆనందాన్ని హ‌ద్దే లేకుండా పోయింది. ఈ ఫొటోని యంగ్ హీరో అఖిల్ అక్కినేని త‌న ఇన్‌స్టా గ్రామ్ పేజీలో అభిమానుల కోసం పోస్ట్ చేశారు.

ఈ ఫొటోకి `అక్కినేనీస్ ఫ్యామిలీ టైమ్` అని క్యాప్ష‌న్ ఇచ్చాడు. ఈ ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అఖిల్‌ త‌న సోద‌రుడు ఆదిత్యకు ఐశ్వ‌ర్య‌తో ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. ఈ ఫంక్ష‌న్ కోస‌మే అక్కినేని కుటుంబ స‌భ్యులంతా ఒక చోట చేరి ఫొటోల‌కు పోజులిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో అఖిల్‌తో పాటు, సుమంత్‌, సుప్రియ‌, సుశాంత్‌, నాగ‌చైత‌న్య‌, నాగార్జున‌, నాగ్ సోద‌రుడు వెంక‌ట్ అక్కినేని, సుమంత్ తండ్రి యార్ల‌గ‌డ్డ సురేంద్ర‌, సోద‌రి నాగ‌సుశీల‌, అమ‌ల‌తో పాటు పిల్ల‌లు, వెంక‌ట్ అక్కినేని వైఫ్ ఇలా అక్కినేని ఫ్యామిలీ వారంతా పాల్గొన్నారు.