నాగచైతన్యకు ఆ రెండు సినిమాలు నచ్చలేదట


Akkineni naga chaitanya reveals his worst moviesనా కెరీర్ లో ఎన్నో చిత్రాలు చేశాను , అన్నీ హిట్ కాలేదు కానీ దఢ , బెజవాడ చిత్రాలు మాత్రం నన్ను చాలా బాధపెట్టాయి అని అంటున్నాడు అక్కినేని నాగచైతన్య . అసలు దఢ , బెజవాడ చిత్రాలు ఎలా ఒప్పుకున్నానో ? తెలియడం లేదు అయితే భవిష్యత్ లో అలాంటి సినిమాలు అస్సలు చేయనని , ఇకముందు కథల విషయంలో జాగ్రత్త పడతానని అలాగే ప్రేమమ్ చిత్రం నాకు మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని అంటున్నాడు నాగచైతన్య . తాజాగా ఈ హీరో నటించిన శైలజారెడ్డి అల్లుడు రేపు విడుదల అవుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చాడు నాగచైతన్య .

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన శైలజారెడ్డి అల్లుడు పై నాగచైతన్య చాలా ఆశలు పెట్టుకున్నాడు . మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన శైలజారెడ్డి అల్లుడు లో రమ్యకృష్ణ అత్తగా నటించగా అనూ ఇమ్మాన్యుయేల్ చైతూ సరసన నటిస్తోంది . ఇక బెజవాడ చిత్ర విషయానికి వస్తే బెజవాడ రాంగోపాల్ వర్మ దర్శకుడు కాబట్టి ఒప్పుకున్నాడు కానీ ఆ సినిమా దారుణమైన పరాజయాన్ని పొందింది . దఢ కొత్త దర్శకుడు అజయ్ భుయాన్ దర్శకత్వంలో తెరకెక్కింది . ఈ రెండు చిత్రాలు కూడా చైతూ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ లు .

English Title: Akkineni naga chaitanya reveals his worst movies