కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు జరుపుకున్న నాగార్జున!

Akkineni Nagarjuna Birthday
Akkineni Nagarjuna Birthday

“మన్మధుడు-2” చిత్రం రిలీజ్ తర్వాత కింగ్ నాగార్జున హాలిడే ట్రిప్ కి స్పెయిన్ వెళ్లారు. అక్కడే ఆయన నిన్న(ఆగస్ట్ 29)న 60వ పుట్టినరోజును కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు అక్కినేని అభిమానులు సోషల్‌మీడియా వేదికగా కింగ్‌ నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే అక్కినేని వారి ముద్దుల కోడలు సమంత ఇంస్టాగ్రామ్ లో మామ నాగార్జునకు శుభాకాంక్షలు తెలిపి, పొగడ్తలతో ముంచెత్తారు. నాగార్జున స్విమ్మింగ్‌ పూల్‌లో ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘మీతో పాటు మీపక్కన ఉన్నవాళ్లందరూ ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. అది మీ గొప్పదనం. మీరు వయస్సును కూడా ఓడించారు మామా.. హ్యాపీ బర్త్‌డే కింగ్‌ నాగ్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతోపాటు కుటుంబసభ్యులతో కలిసి దిగిన మరో ఫొటోను కూడా పోస్ట్ చేశారు.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!

 

View this post on Instagram

 

Nag mama says “Thankyou for all the love .. always and forever .. your blessings matter the most “

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Credit: Instagram