స‌మంత కొత్త అవ‌తారం ఎందు కోసం?స‌మంత కొత్త అవ‌తారం ఎందు కోసం?
స‌మంత కొత్త అవ‌తారం ఎందు కోసం?

వివాహానంత‌రం నుంచి స‌మంత పంథా మారిపోయింది. కొత్త త‌ర‌హా చిత్రాల్ని మాత్ర‌మే అంగీక‌రిస్తూ వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారామె. న‌ట‌న‌కు ప్రాధాన్యం వున్న చిత్రాల్ని మాత్ర‌మే అంగీక‌రిస్తూ వ‌స్తున్న ఆమె త‌మిళంలో `సూప‌ర్ డీల‌క్స్‌`, తెలుగులో మ‌జిలీ, ఓ బేబీ వంటి విభిన్న‌మైన చిత్రాల‌తో ఆక‌ట్టుకుంది.

ప్ర‌స్తుతం తెలుగులో `96` ఆధారంగా రూపొందుతున్న `జాను` చిత్రంలో న‌టిస్తున్న స‌మంత `ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ బాట‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. మ‌నోజ్ బాజ్‌పాయ్ హీరోగా న‌టిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ని రాజ్ ఎన్ డీకే రూపొందిస్తున్నారు. టెర్ర‌రిజ‌మ్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ త్వ‌ర‌లోనే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతోంది.

ఇదిలా వుండ‌గా స‌మంతా ఓ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్య‌వహ‌రించ‌బోతోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇది తెలుగా లేక త‌మిళ షోనా అన్న‌ది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. సామ్ న‌టిస్తున్న తాజాచిత్రం `జాన్` ఫిబ్ర‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. శ‌ర్వానంద్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని ప్రేమ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు.