గోవాలో నాగ్ బ్యూటీ హంగామా


గోవాలో నాగ్ బ్యూటీ హంగామా
గోవాలో నాగ్ బ్యూటీ హంగామా

టాలీవుడ్ మ‌న్మ‌థుడు కింగ్ నాగార్జున హీరోయిన్ అక్ష‌ర గౌడ గోవా బీచ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. సినిమా షూటింగ్‌లు పెద్ద‌గా జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఖాలీ స‌మ‌యాన్ని గోవాలో స్పెండ్ చేస్తోంది. గ‌త ఏడాది కాలంగా గోవాలో విహ‌రిస్తున్న అక్ష‌ర బీచ్ అందాల‌ని మ‌రింత‌గా అన్వేషిచింద‌ట‌. ఇందుకు స‌హ‌క‌రించిన రివా బీచ్ రిసార్ట్ వారికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలుపుతోంది.

టు పీస్ బికినీలో గోవీ అందాల మ‌ధ్య అక్ష‌ర త‌న థై షోతో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ క‌ల‌ర్ డ్రెస్సులో వైట్ ఫ్ల‌వ‌ర్స్ సింబ‌ల్స్‌తో వున్న బికినీ ధ‌రించి ఆ పై బ్లాక్ క‌ల‌ర్ ట్రాన్స్‌ప‌రెంట్ క్లాత్‌తో త‌న అందాల‌ని క‌వ‌ర్ చేస్తూ బ్లాక్ క‌ల‌ర్ గాగుల్స్ ధ‌రించి గోవాబీచ్‌లో విహ‌రిస్తోంది. అక్ష‌ర గౌడ త‌న బికినీని అనిత భూక్యా డిజైన్ చేసింద‌ని తెలిపింది.

ప్ర‌స్తుతం ఈ ఫొటోల్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. హీరోయిన్‌గా ఎంత హాట్ గా వున్నా అక్ష‌ర టైమ్ మాత్రం క‌లిసి రావ‌డం లేదు. ప్ర‌స్తుతం ఆమె దృష్టంతా `శూర్ప‌ణ‌ఖ‌`పైనే వుంది. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీతో అయినా త‌న ఫేట్ మారుతుందేన‌ని ఆశ‌గా ఎదురుచూస్తోంది.