
కరోనా ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ మహమ్మారి ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మందు లేకపోవడంతో లాక్డౌన్ ఒక్కటే మార్గం అని దేశాలన్నీ ప్రస్తుతం లాక్‌డౌన్‌ని ప్రకటించాయి. ఇప్పటికి ఇండియాలో నెల రోజులు దాటిపోవడంతో అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. జన జీవితం పూర్తిగా స్థంభించిపోయింది.
ఇదిలా వుంటే ఈ సమయంలో ఇంటి పట్టునే వుంటున్న మహిళలంతా జీన్స్ ధరించాలని చెబుతోంది కన్నడ సోయగం అక్షరా గౌడ. హిందీ చిత్ర `చిత్కబరే` చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే సంచలనం సృష్టించింది. ఆ తరువాత తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తున్న అక్షర గౌడ ఇటీవల `మన్మథుడు -2` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాల్ని దక్కించుకోలేకపోయింది.
తెలుగులో మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అక్షర గౌడ ఈ లాక్డౌన్ టైమ్‌లో లేడీస్‌కి కొత్త జిట్కా చెబుతోంది. ఈ టైమ్‌లో లేడీస్ జీన్స్ వేసుకోవాలని సలహా ఇస్తోంది. తమ వార్డ్రోబ్ ని జీన్స్‌తో నింపేయమని చెబుతోంది. అలా చేయడం వల్ల ఈ లాక్డౌన్ సమయంలో ఎంత బరువు పెరిగారో తెలిసిపోతుందని సెలవిస్తోంది. దీంతో పాటు సోషల్ మీడియా ఇన్ స్టాలో ఓ ఫొటోని కూడా షేర్ చేయడం ఆకట్టుకుంటోంది.