విడుద‌లై వారం తిర‌క్కుండానే ఓటీటీకి!

Akshara now streaming on amazon prime
Akshara now streaming on amazon prime

‘ఏక్కడికి పోతావు చిన్నవాడ’ ఫేమ్ నందితా శ్వేత ఇటీవల న‌టించిన చిత్రం `అక్ష‌ర‌`. విద్యావ్య‌వ‌స్థ నేప‌థ్యంలో దర్శకుడు చిన్ని కృష్ణ తెర‌కెక్కించిన ఈ  సస్పెన్స్ థ్రిల్లర్ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల‌ ముందుకు వచ్చింది. బ‌ల‌మైన కంటెంట్‌లో రూపొందించిన ఈ చిత్ర ప్రచార చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఈ చిత్రం గ‌త నెల 26 న థియేటర్లలోకి వచ్చింది.

తొలి రోజ్ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన ల‌భించింది. ఆ త‌రువాత కూడా పెద్ద‌గా ఆడియ‌న్స్ థియేట‌ర్‌కు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా వుంటే ఈ సినిమా విడుదలై వారం రోజులు కూడా కాకాకుండానే ఈ చిత్రం ఇప్పుడు ఒటిటి ప్లాట్‌ఫాం `అమెజాన్ ప్రైమ్ వీడియో`లో ప్రసారం అవుతోంది. ‘అక్షర’ చిత్రం థియేటర్ లో విడుదలైన 7 రోజుల్లోనే ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయడం ప్రారంభించింది. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు ఏ చిత్రానికి జ‌ర‌గ‌లేదు.

అకస్మాత్తుగా OTTలో  విడుదల చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు బలహీనంగా ఉండడం వల్లే కావచ్చని అంటున్నారు. ఫిల్మ్ యూనిట్ అయితే సోషల్ మీడియాలో అదే ప్రచారం చేయడం ప్రారంభించింది. ఈ చిత్రాన్ని థియేటర్ల నుండి తీసివేసినందున వారు ఈ చిత్రాన్ని OTT ప్లాట్‌ఫాంలో ఈ చిత్రాన్ని చూసి త‌మ‌ అభిప్రాయాన్ని పంచుకోవాలని ప్రేక్షకులను అభ్యర్థిస్తున్నారు.