సెట్ లో కొట్టుకున్న అక్షయ్ కుమార్ – రోహిత్ శెట్టి


Akshay Kumar and Rohith Shetty Fight
Akshay Kumar and Rohith Shetty Fight

“చూసే వాళ్ళ దౌర్భాగ్యమో, లేదా తీసే వాళ్ళ చేత కాని తనమో” నాకైతే తెలియదు కానీ, ఈ మధ్య సినిమాలు అన్నీ, కంటెంట్ కన్నా, ఎక్కువగా, కాంట్రవర్సీ మీద ఆధారపడి సినిమాలు తీస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళందరికీ లేని గజ్జి అంటించుకొని, ఆ తర్వాత మనోభావాలు – మట్టిగడ్డలు దెబ్బతిన్న తరువాత, తాపీగా జాలిం లోషన్ రాసుకోవడం బాగా అలవాటు అయిపోయింది.

ఇంతకీ అసలు చెప్పొచ్చేది ఏంటంటే, బాలీవుడ్ వాళ్ళకి సినిమా ను ప్రమోట్ చేసుకోడానికి, కావాలని చిల్లర కథలు పడటం అనే జబ్బు ఎప్పటి నుండో ఉంది. తీసిన సినిమాలో విషయం ఉన్నా, లేకపోయినా, బికినీ సైజ్ దగ్గర నుండి ఇండియా – పాకిస్తాన్ గొడవ దాక ఎదో ఒక వివాదం అతికించి లబ్ది పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ జాబితాలో ఖిలాడీ అక్షయ్ కుమార్, బాలీవుడ్ వి.వి. వినాయక్ అని అందరూ పిలిచే డైరెక్టర్ రోహిత్ శెట్టి కూడా చేరిపోయారు.

ప్రస్తుతం దేశ భక్తి సినిమాలు తీస్తున్న అక్షయ్ కుమార్ కి, తన సినిమాలలో కథ ఉన్నా, లేకపోయినా, కార్ల చేజింగ్ లతో మేనేజ్ చేసే దర్శకుడు రోహిత్ శెట్టి కి మద్య గొడవ అయిందని ఒక ఉప్మా గాసిప్ హల్ చల్ చేస్తున్న నేపధ్యంలో దానికి కౌంటర్గా, ఈ ఇద్దరు పతివ్రతలు తాము చేస్తున్న, “సూర్య వంశీ” సినిమా సెట్ లో కొట్టుకున్నట్లు నటించి సీన్ క్రియేట్ చేసారు. ఆఖరికి పోలీసులు కూడా వచ్చినట్లు చూపించారు.

అసలు ఒక పులిహోర గాసిప్ ని సీరియస్ గా తీసుకోవడమే తప్పు

వందల కోట్ల రేంజ్ సినిమాలు చేసే ఒక హీరో, ఇంకో డైరెక్టర్ దానికి మరీ ఇలా రియాక్ట్ జనాలని వెర్రి పుష్పాలు చెయ్యాలని అనుకోవడం నిజం గా వెరీ చీప్ అని బాలీవుడ్ జనాలు బూతులు తిడుతున్నారు.