ఆమీర్ కోసం అక్షయ్ త్యాగంAkshay Kumar did a big help Aamir Khan
Akshay Kumar did a big help Aamir Khan

చిన్నప్పుడు అందరూ అక్షరాలే చదువుకుంటారు.. కానీ పెద్ద అయిన తరువాత మాత్రం అంకెలు నేర్చుకుని వాటి ద్వారానే మాట్లాడుతారు. అక్షరాలు జ్ఞానాన్ని నేర్పిస్తే, అంకెలు వ్యాపారాన్ని నేర్పిస్తాయి. ప్రస్తుతం ప్రజలకి కూడా ఏదైనా యపారమే. ఇలాంటి తరహా ఆలోచన సినిమా రంగంలో చాలా ఎక్కువ. కెమెరాల ముందు అన్నీ బాగుండాలి, అంతా బాగుండాలి ,అన్ని సినిమాలు ఆడాలని మాట్లాడే వాళ్ళు, మనసులో మాత్రం పక్కనోడి సినిమా కన్నా మన సినిమా ఒక రూపాయి అయినా ఎక్కువగా వసూలు చెయ్యాలని కోరుకుంటారు. అది సహజం. కొన్నిసార్లు మాత్రం ఇందాక నేను చెప్పిన అంకెలు – అక్షరాల సంఘర్షణలో అక్షరాలూ గెలవడం వల్ల కొంతమంది పక్కన వాళ్ళ మంచి గురించి కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు అలా ఆలోచించి నిజంగా గెలిచిన వ్యక్తి బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్. అతను చేసిన గొప్ప పని అడిగినదే తడవగా తన సహా నటుడు ఆమీర్ ఖాన్ సినిమా కోసం తన సినిమాను రిలీజ్ ను వాయిదా వేసుకోవడం.

అక్షయ్ సినిమా అయిన “బచ్చన్ పాండే”, ఆమీర్ సినిమా “లాల్ సింగ్ చడ్డా” రెండూ డిసెంబర్ 25న రిలీజ్ ప్లానింగ్ ఉండగా, ఆమీర్ తన సినిమా కోసం అక్షయ్ కుమార్ ను రిలీజ్ వాయిదా కోసం రిక్వెస్ట్ చేసారు. వెంటనే అక్షయ్ తన సినిమాను పోస్ట్ పోన్ చేసారు. ఆమీర్ సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలం అయ్యింది. 3 ఏళ్ళకు ఒక సినిమా చేస్తాడు ఆమీర్. ఏడాదికి 3 సినిమాలు చేస్తాడు అక్షయ్. ఒకవేళ రెండు సినిమాలు రిలీజ్ అయితే హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా, ఆమీర్ సినిమాకే లాస్ అవుతుంది. ఆమీర్ కోసం అక్షయ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇండస్ట్రీ మొదట షాక్ అయినా “నిజమైన హీరో ” అని పొగడ్తల వర్షం కురిపిస్తోంది. ఇక ఆమీర్ కూడా అక్షయ్ చేసిన హెల్ప్ గురించి సోషల్ మీడియా వేదికలలో తన కృతజ్ఞతను పంచుకుంటున్నాడు.