హిజ్రాల‌కి కోటిన్న‌రిచ్చిన స్టార్ హీరో!హిజ్రాల‌కి కోటిన్న‌రిచ్చిన స్టార్ హీరో!
హిజ్రాల‌కి కోటిన్న‌రిచ్చిన స్టార్ హీరో!

మాన‌వ‌తా వాదాన్ని చాటు కోవ‌డంలో ముందుండే వ్య‌క్తి రాట‌ఘవ లారెన్స్‌. గ‌త కొంత కాలంగా అనాథ‌ల‌కు, అభాగ్యుల‌కు అండ‌గా నిలుస్తూ త‌న సేవా నిర‌తిని చాటుకుంటున్నారు. చెన్నైలో ఇందు కోసం ప్ర‌త్యేకంగా ఓ ఆశ్ర‌మాన్నే న‌డుపుతున్న లారెన్స్ ఇటీవ‌లే హైద‌రాబాద్‌లోనే ఓ బ్రాంచ్‌ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం `కాంచ‌న‌` చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. అక్ష‌య్‌కుమార్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి `ల‌క్ష్మీ బాంబ్‌` అనే టైటిల్‌ని చిత్ర బృందం ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించింది.

ఓ హిజ్రా హ‌త్యోదంతం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో హిజ్రాల కష్టాలు తెలుసుకుని చ‌లించిపోయిన అక్ష‌య్‌కుమార్ వారి కోసం లారెన్స్ ఏర్పాటు చేస్తున్న వ‌స‌తి గృహానికి కోటిన్న‌ర విరాళం ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. లారెన్స్‌కి అక్ష‌య్‌కుమార్ కూడా తోడ‌వ్వ‌డంతో ఇజ్రాల సొంత ఇంటి కల త్వ‌ర‌లోనే నెల‌వేర‌బోతోంది. కోటిన్న‌ర చెక్కుని లారెన్స్ స‌మ‌క్షంలో హిజ్రాలకు అక్ష‌య్‌కుమార్ అందించారు.

హిజ్రాల కోసం కోటిన్న‌ర ఆర్థిక స‌హాయాన్ని చేసిన ఏకైక బాలీవుడ్ హీరో అక్ష‌య్ అని లారెన్స్ ఈ సంద‌ర్భంగా కొనియాడారు. హిజ్రాల ఇంటి స‌మ‌స్య‌పై షూటింగ్ స‌మ‌యంలో వివ‌రించాన‌ని, అప్పుడే తాను మాటిచ్చాడ‌ని, ఇప్పుడు ఇచ్చిన మాట‌ని నిలబెట్టుకోవ‌డం ఆనందంగా వుంద‌ని లారెన్స్ వెల్ల‌డించారు.