లక్ష్మీ బాంబ్ పేలేందుకు సిద్ధం!

లక్ష్మీ బాంబ్ పేలేందుకు సిద్ధం!
లక్ష్మీ బాంబ్ పేలేందుకు సిద్ధం!

రాఘవలారెన్స్ నటించి తెరకెక్కించిన చిత్రం ‘కాంచన‘. హారర్ థ్రిల్లర్ కథాంశానికి ఎంటర్టైన్మెంట్ ని జోడించి పక్కా కమర్షియల్ మూవీగా  రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల ని రాబట్టి హారర్ థ్రిల్లర్ చిత్రాలలో సరికొత్త రికార్డులని సృష్టించింది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అనూహ్య విజయాన్ని సాధించింది. రాఘ‌వ లారెన్స్ న‌టించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా లక్ష్మీరాయ్ న‌టించ‌గా, హిజ్రా పాత్ర‌లో హీరో శ‌ర‌త్‌కుమార్ న‌టించారు.

ఇదే చిత్రాన్ని హిందీ లో హీరో అక్షయ్ కుమార్ తో  రీమేక్ చేస్తున్నారు. ‘లక్ష్మీ బాంబ్’ పేరు తో రీమేక్ చేస్తున్న ఈ చిత్రంలో  కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నది. కీల‌క మైన ల‌క్ష్మీ పాత్ర‌లో హిజ్రాగా `స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్` విల‌న్ శ‌ర‌ద్ ఖేల్క‌ర్ న‌టిస్తున్నారు. మ‌రో కీల‌క పాత్ర‌లో తుషార్ క‌పూర్ క‌న‌పించ‌నున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ లో రిలీజ్ చేయాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అయితే టీమ్ మాత్రం మ‌రి కొన్ని రోజులు ఆగి థియేట‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని భావిస్తోందట‌.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మార్పులు ఏర్ప‌డి సాధార‌ణ ప‌రిస్థితులు మొద‌లై థియేట‌ర్లు రీ ఓపెన్ అయితే థియేట‌ర్స్‌లో అక్ష‌య్ కుమార్ పుట్టిన రోజైన సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ చేయాల‌ని, లేదంటే ఓటీటీకే జై కొట్టాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది. ఈ చిత్రానికి త‌నిష్క్ బ‌గ్చి సంగీతం అందిస్తున్నారు. హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం అక్ష‌య్‌కి బ్లాక్ బ‌స్ట‌ర్‌ని అందిస్తుంద‌ని అంతా భావిస్తున్నారు.