ఇది నాకు స్వీటెస్ట్ మెమ‌రీ: అల్లు అర్జున్‌


Ala industry hit is a swseetest memory for me allu arjun
Ala industry hit is a swseetest memory for me allu arjun

మ‌రొక‌రితో క‌లిసి చేసిన సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకోవ‌డం కంటే తండ్రి నిర్మించిన సినిమాతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకుంటే వ‌చ్చే మ‌జానే వేరు. ఇప్పుడు అలాంటి కిక్‌నే అల్లు అర్జున్ ఎంజాయ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి బ‌రిలో నిలిచి ఇండ‌స్ట్రీ రికార్డుల్ని తిర‌గ‌రాస్తోంది. ఈ సినిమాతో ఇండ‌స్ట్రీ హిట్ కొట్ట‌బోతున్నామ‌ని బ‌న్నీకి ముందే తెలుసంటా. ఆయన అంచ‌నా `అల వైకుంఠ‌పుర‌ములో` విష‌యంలో ఎక్కడా త‌ప్ప‌లేదు. ఆడియోతో పాటు సినిమా కూడా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డంతో బ‌న్నీఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు.

ఇదే విష‌యాన్నిస‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌లో అభిమానుల‌తో పంచుకున్నారు. త‌న తండ్రి  ర‌జ‌నీకాంత్‌, చిరంజీవితో ఎన్నోఇండ‌స్ట్రీ హిట్ల‌ని సాధించార‌ని, ఆయ‌న‌తో ఒక్క ఇండ‌స్ట్రీ హిట్ అయినా కొట్టాల‌నుకునేవాడిన‌ని చెప్పుకొచ్చారు. నిజంగా ఈ సినిమాతో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టాన‌ని, ఇది త‌న‌కు స్వీటెస్ట్ మెమ‌రీ అని, ఇంత‌టి విజ‌యాన్ని త‌న తండ్రి నిర్మించిన చిత్రం ద్వారా పొందే అవ‌కాశాన్నిచ్చిన త్రివిక్ర‌మ్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అని బ‌న్నీ పేర్కొన్నారు.

18 నెల‌ల విరామం త‌రువాత బ‌న్నీ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. సంక్రాంతి బ‌రిలో జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం అనూహ్య విజ‌యాన్ని సాధిస్తూ రికార్డుల మోత మోగిస్తోంది. దీనిపై కూడా బ‌న్నీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆర్నేళ్ల త‌రువాత ఇలాంటి హిట్‌ని మ‌రొక‌రు కొడ‌తార‌ని, ప్రేక్ష‌కుల్ని ఆనందింప‌జేశానా లేదా అన్న‌దే నాకు ముఖ్యం. రికార్డులు తాత్కాలికం. ఫీలింగ్స్ అనేవి శాశ్వ‌తం` అని స్ప‌ష్టం చేశారు.