‘అలా మొదలైంది’.. మళ్ళీ ఇలా మొదలవుతోంది


'అలా మొదలైంది'.. మళ్ళీ ఇలా మొదలవుతోంది
‘అలా మొదలైంది’.. మళ్ళీ ఇలా మొదలవుతోంది

రొమాంటిక్ కామెడీ అలా మొదలైంది చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకురాలిగా పరిచయమైంది నందిని రెడ్డి. నాని హీరోగా నటించిన ఆ సినిమా మంచి విజయం సాధించింది. హిట్ కాంబినేషన్ అయినా కూడా ఎందుకో ఈ ఇద్దరూ మళ్ళీ కలిసి పనిచేయలేదు. అది ఇప్పుడు మళ్ళీ నెరవేరుతుంది అని తెలుస్తోంది.

ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి చిత్రాలను నిర్మించిన స్వప్న సినిమాస్ బ్యానర్ లో ఒక సినిమా ఒప్పుకుంది నందిని రెడ్డి. ఇటీవలే ఓ బేబీ సినిమాతో హిట్ అందుకున్న నందిని ఈసారి తన స్టైల్ లోనే మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేసింది. ఈ చిత్రంలో హీరోగా నానిని అనుకుంటున్నట్లు సమాచారం. ఇటీవలే నాని నికార్సయిన హిట్ కొట్టింది లేదు. తన నటనతో మంచి మార్కులైతే వస్తున్నాయి కానీ సినిమాకు డబ్బులు రావట్లేదు. ఈ నేపథ్యంలో నందిని రెడ్డితో సినిమా చేయడానికి నాని కూడా ఆసక్తి చూపిస్తున్నాడు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుంది. మరోవైపు నాని ప్రస్తుతం V అనే చిత్రంలో ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో నటిస్తున్నాడు. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం థాయిలాండ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకుడు.