`అల..` స్పెష‌ల్ ఈవెంట్ ర‌ద్ద‌యింది!


`అల..` స్పెష‌ల్ ఈవెంట్ ర‌ద్ద‌యింది!
`అల..` స్పెష‌ల్ ఈవెంట్ ర‌ద్ద‌యింది!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా కాలంగా ఎద‌రుచూసిన భారీ విజ‌యం `అల వైకుంఠ‌పుర‌ములో`తో ల‌భించింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వున్న అల్లు అర్జున్‌, `అల‌..` టీమ్ సెల‌బ్రేష‌న్స్‌ని భారీగానే ప్లాన్ చేసింది. సినిమా రిలీజ్ త‌రువాత హైద‌రాబాద్‌లో స‌క్సెస్ సంబ‌రాల‌ని జ‌రుపుకున్న `అల‌..` టీమ్ వ‌రుస‌గా భారీ ఈవెంట్‌ల‌ని ప్లాన్ చేసింది.

ఇందులో భాగంగా ఈ నెల 19న వైజాగ్‌లో `అల వైకుంఠ‌పుర‌ములో` టీమ్ భారీ ఈవెంట్‌ని నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో ఏపీకి చెందిన ప‌లువురు మంత్రులు, టీడీపీకి చెందిన మాజీ మంత్రులు హాజ‌ర‌య్యారు. బ‌న్నీ ఈ ఈవెంట్‌లో తన మ‌న‌సులోని మాట‌ల్ని అభిమానుల‌తో పంచుకుని హుషారెత్తించారు. శుక్ర‌వారం తిరుప‌తిలోనూ భారీ సెల‌బ్రేష‌న్‌ని ప్లాన్ చేశారు.

అయితే అల్లు అర్జున్ మేన‌మామ ముత్తంశెట్టి రాజేంద్ర‌ప్ర‌సాద్ నిన్న‌ రాత్రి విజ‌య‌వాడ‌లో గుండెపోటుతో మ‌రిణించడంతో తిరుప‌తిలో చేయాల‌నుకున్న ఈ వెంట్‌ని `అల‌..` టీమ్ అర్థాంత‌రంగా ర‌ద్దు చేసుకున్న‌ట్టు తెలిసింది. ముత్తంశెట్టి రాజేంద్ర‌ప్ర‌సాద్ ద‌శ‌దిన కర్మ పూర్త‌యిన త‌రువాతే తిరుప‌తి ఈ వెంట్ గురించి చిత్ర బృందం ఆలోచించాల‌ని భావిస్తోంద‌ట‌.