అల వైకుంఠపురములో ప్రధాన ట్విస్ట్ అదేనట!


అల వైకుంఠపురములో ప్రధాన ట్విస్ట్ అదేనట!
అల వైకుంఠపురములో ప్రధాన ట్విస్ట్ అదేనట!

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్ పోస్టర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన కథ ఇదేనంటూ ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం..

జయరాం ఒక బిలియనీర్, అతని దగ్గర కార్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు మురళి శర్మ. జయరాం కొడుకు అల్లు అర్జున్ కాగా, మురళి శర్మ కొడుకు సుశాంత్. అయితే మురళి శర్మ తన కొడుకు కూడా తనలాగే పెద్దయ్యాక డ్రైవర్ అవుతాడని చెప్పగా, దానికి జయరాం ఒప్పుకోడు. ఒక మనిషి యొక్క గమ్యాన్ని నిర్దేశించేది అతని ఆలోచనలు, కష్టపడే తత్వమే కానీ పుట్టుక కాదని చెప్తాడు.

ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో చివరికి ఒక డీల్ కి వస్తారు. ఇద్దరూ తమ కొడుకుల స్థానాన్ని మార్చుకోవాలనుకుంటారు. అయితే పెద్దయ్యాక ఆ విషయం అల్లు అర్జున్ కు తెలిసినా సుశాంత్ తన అసలు స్థానానికి రావడానికి నిరాకరించడంతో అసలు సమస్య మొదలవుతుంది. ఈ సమస్యలో నవదీప్ పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది.

కథ పాతగా ఉన్నా త్రివిక్రమ్ ట్రీట్మెంట్ సరికొత్తగా ఉంటుందని చిత్ర వర్గాలు తెలుపుతున్నాయి. మరి ఈ కథతో త్రివిక్రమ్ జనాలను మెప్పించగలడా లేదా అన్నది చూడాలి.