`అల..` ఖాతాలో మ‌రో రికార్డ్ చేరింది!


`అల..` ఖాతాలో  మ‌రో రికార్డ్ చేరింది!
`అల..` ఖాతాలో మ‌రో రికార్డ్ చేరింది!

మాట‌ల మాంత్రికుడు, ఎండితెర తాంత్రికుడు త్రివిక్ర‌మ్ చేసిన మ్యూజిక‌ల్ వండ‌ర్ `అల వైకుంఠ‌పుర‌ములో`. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్‌తో అల్లు అర‌వింద్‌, ఎస్‌. రాధాకృష్ణ రాజీప‌డ‌ని మేకింగ్ ఈ సినిమాని ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిపింది. సంక్రాంతి బ‌రిలో నిలిచిన ఈ చిత్రం బ‌న్నీ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని సాధించిన చిత్రంగా రికార్డుల కెక్కింది.

తాజాగా ఈ సినిమా ఖాతాలో మ‌రో రికార్డు వ‌చ్చి చేరింది. ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు వ‌ర‌ల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లని సాధించి ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేస్తోంది. యూఎస్‌ మార్కెట్‌లో ఈ చిత్రం స‌రికొత్త రికార్డుని నెల‌కొల్పింది. త్రివిక్ర‌మ్ సినిమా అంటే యూఎస్ మార్కెట్‌లో మంచి క్రేజ్ వుంది. ఆ క్రేజ్‌కి బ‌న్నీ మేనియా తోడ‌వ్వ‌డంతో వ‌సూళ్ల వ‌ర్షం కురుస్తోంది. 21 రోజుల్లో యూఎస్ మార్కెట్‌లో ఈ చిత్రం 3.5 మిలియ‌న్ మార్కుని దాటేసింది. బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్‌ని సృష్టించింది. అంతేనా యూఎస్‌లో అత్య‌ధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో టాప్ 3లో నిలిచింది.

యూఎస్ మార్కెట్‌లో ఆల్ టైమ్ టాప్ 5 గ్రాస్ సాధించిన చిత్రాలు

1. బాహుబ‌లి 2 – $ 11, 812కె
2. బాహుబ‌లి – $ 6,865కె
3. అల వైకుంఠ‌పుర‌ములో – $ 3,521కె
4. రంగ‌స్థ‌లం – $ 3,515కె
5. భ‌ర‌త్ అనే నేను – $ 3,422కె