ఇంత‌కీ ఆ వైకుంఠ‌పుర‌ము ఎవ‌రిది?


ఇంత‌కీ ఆ వైకుంఠ‌పుర‌ము ఎవ‌రిది?
ఇంత‌కీ ఆ వైకుంఠ‌పుర‌ము ఎవ‌రిది?

అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. మాట‌ల మాంత్రికుడు త్ర‌విక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్‌తో అల్లు అర‌వింద్‌, ఎస్‌. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ఫ్యామిలీ ఎమోష‌న్స్ నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమాలో వైకుంఠ‌పుర‌ము ప్ర‌ధాన పాత్ర పోషించింది. అందుకే ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఆ పేరునే సినిమా టైటిల్‌గా పెట్టేశారు.

ఈ 12న ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా 74 కోట్లు వ‌సూలు చేసి నాన్ బాహుబ‌లి 2 రికార్డుని బ‌ద్ద‌లు కొట్టింది. రానున్న రోజుల్లో మ‌రింత‌గా వ‌సూళ్ల‌ని సాధించే అవ‌కాశాలే ఎక్కువ‌గా వున్నాయిని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషించిన హీరో ఇంటి గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత‌కీ ఆ ఇంటి సెట్‌ను చిత్ర బృందం ఎక్క‌డ వేసింది. హైద‌రాబాద్‌లోనే అయితే ఆ ఇల్లు ఎక్క‌డ వుంది. లాంటి ఆరాలు తీయ‌డం మొద‌లైంది.

`అల వైకుంఠ‌పుర‌ములో` చూపించిన ఇల్లు ప్ర‌ముఖ వార్తా ఛాన‌ల్ ఎన్టీవీ అధినేత కుమార్తె అత్త గారిల్ల‌ని తెలిసింది. బ‌య‌టి నుంచి ఇంటిని చూపించే స‌న్నివేశాల కోసం ఆ ఇంటిని చూపించిన త్రివిక్ర‌మ్ ఇంటీరియ‌ర్ స‌న్నివేశాల కోసం మాత్రం అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వేసిన సెట్‌లో తీశార‌ట‌. ఆ ఇంటిని దాదాపు వంద కోట్ల‌తో క‌ట్టించిన‌ట్టు చిత్ర వ‌ర్గాల్లో వినిపిస్తోంది.