`అల వైకుంఠ‌పుర‌ములో` భారీ హంగామా @ వైజాగ్‌!


`అల వైకుంఠ‌పుర‌ములో` భారీ హంగామా @ వైజాగ్‌!
`అల వైకుంఠ‌పుర‌ములో` భారీ హంగామా @ వైజాగ్‌!

బన్నీ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ రూపొందించిన చిత్రం `అల వైకుంఠ‌పురములో`. అల్లు అర‌వింద్‌తో క‌లిసి ఎస్‌. రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై అనూహ్య విజ‌యాన్ని సాధించింది. ఓవ‌ర్సీస్‌లో ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షోల‌తో హంగామా సృష్టిస్తున్నఈ సినిమా భారీ వ‌సూళ్లని సాధిస్తోంది. త‌మ‌న్ అందించిన పాట‌ల‌తో రిలీజ్ కు ముందే భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని సాధించే చిత్రంగా నిలిచే అవ‌కాశం వుంద‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి.

సినిమాలో బ‌న్నీ కొత్త‌గా వున్నాడ‌ని, గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా క‌నిపించాడ‌ని, త‌న‌లో ఇన్ని వేరియేష‌న్స్ వున్నాయ‌ని తాను అనుకోలేద‌ని నిర్మాత అల్లు అర‌వింద్ సినిమా సాధిస్తున్నవిజ‌యంపై, సినిమాలో అల్లు అర్జున్ పోషించిన బంటు పాత్ర‌పై ప్ర‌శంసల‌తో పాటు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేశారు. సినిమా ఊహించిన స్థాయికి మించి భారీ వ‌సూళ్ల దిశ‌గా ప‌య‌నిస్తుండ‌టం, ఇప్ప‌టికే యుఎస్‌లో రికార్డు సాధించ‌డంతో చిత్ర బృందం సంబ‌రాలు చేసుకుంటున్నారు.

తాజాగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్‌లో నిర్మాత అల్లు అర‌వింద్ ఈ సినిమా స‌క్సెస్ సంబ‌రాల‌ని ఎక్క‌డ చేయ‌బోతున్నామో చెప్పేశారు. ఈ నెల 18న వైజాగ్‌లో అత్యంత భారీ స్థాయిలో `అల వైకుంఠ‌పుర‌ములో` స‌క్సెస్ సంబ‌రాల‌ని జ‌ర‌ప‌బోతున్న‌ట్టు ఈసంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. దీనికి మ‌రో ఐదు రోజులు మాత్ర‌మే స‌మ‌యం వుండ‌టంతో టీమ్ ఏర్పాట్లు కోసం అప్పుడే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన‌ట్టు తెలిసింది.