స్వామి వారి సేవ‌లో `అల వైకుంఠ‌పురములో` టీమ్‌!


స్వామి వారి సేవ‌లో `అల వైకుంఠ‌పురములో` టీమ్‌!
స్వామి వారి సేవ‌లో `అల వైకుంఠ‌పురములో` టీమ్‌!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. అల్లు అర్జున్ హీరోగా న‌టించిన ఈ చిత్రం ఈ సంక్రాంతి బ‌రిలో నిలిచి ఊహించ‌ని స్థాయిలో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. యూఎస్‌లోనూ టాప్ 5 చిత్రాల జాబితాలో మూడ‌వ స్థానంలో నిలిచిన ఈ చిత్రం వ‌సూళ్ల ప‌రంగానూ రికార్డులు సృష్టిస్తోంది. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌లైన ప్ర‌తీ ఏరియాలోనూ అనూహ్య విజ‌యాన్ని సాధించి ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది.

దీంతో అల టీమ్ వ‌రుస‌ సంబ‌రాలు జ‌రుపుకుంటోంది. ప్రెస్ మీట్స్‌, ఇండ‌స్ట్రీ హిట్‌, నాన్ బాహుబ‌లి రికార్డ్స్ మీట్‌, థాంక్స్ మీట్‌.. ఇండ‌స్ట్రీ పార్టీ, మీడియా పార్టీ.. ఇలా ప‌దుల సంక్ష‌లో పార్టీలు చేసుకుంది. తాజాగా అన్ని పార్టీల్ని ముగించుకున్న చిత్ర బృందం తాజాగా ఏడుకొండ‌ల వాడిని ద‌ర్శించుకోవ‌డానికి శుక్ర‌వారం తిరుమ‌ల వెళ్లింది. అల్లు అర్జున్‌, ఆయ‌న వైఫ్ స్నేహారెడ్డి, పిల్ల‌లు అర్హా, అయాన్‌, త్రివిక్ర‌మ్, థ‌మ‌న్‌, చిత్ర నిర్మాత ఎస్‌. రాధాకృష్ణ త‌దిత‌ర‌లు తిరుమ‌ల వెళ్లిన వాళ్ల‌లో వున్నారు.

ఇదిలా వుంటే అల్లు అర్జున్ ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తే ఎలా వుంటుంద‌నే ఆలోచ‌న‌లో వున్నార‌ట‌. ఇప్ప‌టికే ఈ విష‌యంపై నిర్మాత ఎస్‌. రాధాకృష్ణ‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌తో చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. దీనికి సంబంధించిన చిత్ర వ‌ర్గాల నుంచి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి వార్త బ‌య‌టికి రాలేదు. ఒక వేళ ఆ వార్తే నిజ‌మైతే త్రివిక్ర‌మ్ – అల్లు అర్జున్ కాంబో మ‌రోసారి మ్యాజిక్ చేయ‌డం ఖాయం అన్న‌ట్టే.