అల వైకుంఠపురములో టీజర్ మరింత ముందుకు


Ala Vaikunthapuramlo
అల వైకుంఠపురములో టీజర్ మరింత ముందుకు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురములో. ఇటీవలే విడుదలైన మోషన్ పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే బజ్ బాగా ఉంది.

ఈ సినిమా కథ ఇదేనంటూ రకరకాల కథనాలు ఫిల్మ్ నగర్ లో షికార్లు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే అల వైకుంఠపురములో టీజర్ ను మొదట త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు మరింత ముందుగా దసరా సందర్భంగా అక్టోబర్ 8న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా బయటకు రాలేదు. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో సుశాంత్, నవదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం అందిస్తోన్న విషయం తెల్సిందే. నవంబర్ చివరికల్లా షూటింగ్ ముగియాలన్న టార్గెట్ తో ప్రస్తుతం శరవేగంగా షూట్ చేస్తున్నారు.