అల వైకుంఠపురములో 10 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్


అల వైకుంఠపురములో 10 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
అల వైకుంఠపురములో 10 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ అల వైకుంఠపురములో ఎక్కడా తగ్గేలా కనిపించట్లేదు. సంక్రాంతి అడ్వాంటేజ్ తో మొదలైన అల వైకుంఠపురములో సెలవులు ముగిసినా కానీ స్ట్రాంగ్ హోల్డ్ ను సాధించింది. సోమవారం, మంగళవారం కూడా కలెక్షన్స్ మరీ దారుణమైన డ్రాప్ అయితే కనిపించలేదు. వీక్ డేస్ కూడా చెప్పుకోదగ్గ రేంజ్ లో కలెక్షన్స్ వస్తుండడంతో అల వైకుంఠపురములో నాన్ బాహుబలి రికార్డులు కొల్లగొట్టం ఖాయంగా కనిపిస్తోంది. 10 రోజులకు గాను అల వైకుంఠపురములో 103 కోట్ల షేర్ రాబట్టి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు రికార్డును అధిగమించింది.

సోమవారం 5 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ చిత్రం, మంగళవారం కూడా అదే స్థాయిలో పెర్ఫార్మ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 10 రోజులు కావోస్తోన్నా ఈ చిత్రం స్ట్రాంగ్ గా హోల్డ్ చేయడంతో బాహుబలి 1 కలెక్షన్స్ ను కూడా దాటేలా కనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల వరకూ చూసుకుంటే అల వైకుంఠపురములో బాహుబలి 2, బాహుబలి 1, సైరా నరసింహారెడ్డి తర్వాత నాలుగో స్థానంలో ఉంది. ఈరోజు కలెక్షన్స్ తో సైరా రికార్డులకు కూడా ఎసరు పెట్టడం ఖాయం.

అల వైకుంఠపురములో 10 డేస్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ :

నైజాం : 33.4 కోట్లు
సీడెడ్ : 15.52 కోట్లు
గుంటూరు : 9.45 కోట్లు
ఉత్తరాంధ్ర : 15.61 కోట్లు
తూర్పు గోదావరి : 9.2 కోట్లు
పశ్చిమ గోదావరి : 7.2 కోట్లు
కృష్ణా : 9.17 కోట్లు
నెల్లూరు : 3.75 కోట్లు

ఆంధ్ర + తెలంగాణ : 103.26 కోట్లు

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే కథానాయికగా నటించింది. సుశాంత్, నివేతా పేతురాజ్, టబు, హర్షవర్ధన్, జయరామ్, నవదీప్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్ర అల్బమ్ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు.